Let's talk: editor@tmv.in
కోర్టు భవనం పై నుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య

కోర్టు భవనం పై నుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య

Panthagani Anusha
16 అక్టోబర్, 2025

న్యాయం ఆలస్యం కావడంతో కలిగిన తీవ్ర నిరాశ, మానసిక క్షోభ కారణంగా పూణేలోని, శివాజీనగర్ జిల్లా, సెషన్స్ కోర్ట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసుకు సంబంధించిన విచారణలకు హాజరవుతున్న 60 ఏళ్ల నమదేవ్ జాధవ్, బుధవారం ఉదయం కోర్టు కొత్త భవనం నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు లేఖ

పోలీసుల వివరాల ప్రకారం, జాధవ్ వడ్కి గ్రామానికి చెందిన వృద్ధుడు ఈ హ్యాత్మహత్యకు పాల్పడినట్టు వెల్లడించారు. కాగా జాధవ్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశారు. లేఖలో ఆయన 1998 నుండి కొనసాగుతున్న సివిల్ కేసు సంఖ్యను స్పష్టంగా పేర్కొంటూ . తనకు సంబందించిన కేసు పరిష్కారం కాకపోవడం వల్ల ఆయనలో తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశ ఏర్పడిందని ఎన్నోసార్లు కోర్టుకు వెళ్లినా తనకు న్యాయం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

శివాజీనగర్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మానసిక ఒత్తిడి, నిరాశ కేసు పరిష్కారం ఆలస్యం కావడంతో కలిగిన క్షోభ కారణంగానే జాధవ్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం లేకపోవడం వల్ల ఆయన తీవ్ర ఆందోళనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ సంఘటన జరిగిన వెంటనే కోర్టు సిబ్బంది పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం సాసూన్ జనరల్ హాస్పిటల్కు తరలించారు.

శివాజీనగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారులు స్పందిస్తూ మృతుడి స్వయం స్ఫూర్తి లేఖలో (సూసైడ్ నోట్) ఉన్న వివరాల ఆధారంగా బాధితుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అదేవిధంగా జావీద్ రాసిన లేఖ నిజమా కదా అనేకోణంలో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదనంగా సంఘటన సమయంలో కోర్టులో ఉన్న సిబ్బంది సాక్షుల నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

అదనంగా జాధవ్ తన కేసు ఆలస్యంపై న్యాయ సాయం (లీగల్ ఏడ్) సేవలు తీసుకున్నారా లేదా ఫిర్యాదు చేశారా అనే అంశాలను కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే ఈ విషాదకర ఘటన కోర్టుకు వచ్చే సామాన్య పౌరులలో, ప్రత్యేకించి చిన్నచిన్న కేసుల కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న వారిలో భద్రత, న్యాయంపై నమ్మకం గురించి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. న్యాయం ఆలస్యం కావడమంటే న్యాయం నిరాకరించడమే అనే సూక్తిని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కోర్టు భవనం పై నుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య - Tholi Paluku