
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో తాడిపత్రిలో జేసీ వర్గాల అల్లర్లు
వెంగన్నపల్లి (యాదికీ మండలం)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జేసీ వర్గ౦ వారు దాడికి దిగారు . ఈ దాడిలో లక్ష్మీనాథ్, వెంకటలక్ష్మి అనే వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేటిరెడ్డి పెద్దారెడ్డి సందర్శించి, దాడిని తీవ్రంగా ఖండించారు.ఇదిలా ఉండగా వై ఎస్ ఆర్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమ౦ రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యింది.
తిరుపతిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కి ప్రజల మద్ధతు..
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బందార్ల పల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ తరపున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంబించారు. వివరాల్లోకి వెళితే మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజక వర్గం వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన మోహిత్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రభుత్వం తరపున నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కూటమి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా సంతకాలు సేకరణ మొదలుపెట్టారు. ఈ ప్రజా ఉధ్యమానికి గ్రామస్తులు మద్ధతు తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కోటి సంతకాల సేకరణ ప్రారంభోత్సవంలో చురుగ్గా పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, బందార్లపల్లి గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోందని, దాని ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ఒక్క వైద్య విద్య దూరం కావడమే కాదు దానికి అనుబంధంగా వచ్చే పెద్ద ఆసుపత్రిల్లో ఉచిత వైద్యం కూడా దూరమవుతుందని ప్రతి ఇంటి వద్దకు మోహిత్ రెడ్డి వెళ్ళి వివరించారు. జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ఫించన్లు కూడా పీకేస్తున్నారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఫిర్యాదులు చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు మహిళలు కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
