Let's talk: editor@tmv.in
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్

Gaddamidi Naveen
24 నవంబర్, 2025

మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని, సంగారెడ్డి జిల్లా ఆందోల్ డివిజన్‌లోని సంగుపేట్ లక్ష్మీదేవి గార్డెన్‌లో "ఇందిరా మహిళా శక్తి – మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి" చీరల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది.

కోలాటాలతో మహిళలు స్వాగతం పలకగా, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్, పుల్కల్, వట్పల్లి, చౌటుకూరు మండలాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కోశాధికారి మీనా, జిల్లా సమైక్య సంఘ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సిరిసిల్ల చేనేత కేంద్రంలో తయారైన నాణ్యమైన చీరలను ఈ సందర్భంగా పంపిణీ చేశామ‌ని తెలిపారు.

మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఆడబిడ్డకు అందిస్తున్న ఇందిరమ్మ చీర మహిళా ఐక్యతకు ప్రతీక అని తెలిపారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మహిళా సంఘాలు ఐక్యంగా కదిలితే ఆర్థిక ప్రగతి సాధ్యమని సూచించారు.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళను కొత్త సంఘాల్లో సభ్యులుగా చేర్చేందుకు సమైక్య సభ్యులు పనిచేయాలని ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు చీరలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో ఎస్ఈఆర్పీ కార్యకలాపాల పురోగతి

సంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 16,164 స్వయం సహాయక సంఘాలు, 1,65,467 మహిళా సభ్యులతో విజయవంతంగా పనిచేస్తున్నాయని. మహిళల ఆర్థిక, నైపుణ్య, జీవనోపాధి అభివృద్ధి వైపు ఎస్ఈఆర్పీ చేపట్టిన చర్యలు విశేష ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఆర్థిక యూనిట్ల పంపిణీ వివరాలు:

2024–25: 10,926 సంఘాలకు రూ. 911.39 కోట్లు

2025–26 (నవంబర్ 2025 వరుకు): 6,160 సంఘాలకు రూ. 590.61 కోట్లు

అదనంగా 14,040 సంఘాలకు రూ. 32.92 కోట్లు

ఉద్యోగావకాశాలు, యూనిట్లు :

2024–25లో 9,809 యూనిట్లు – రూ. 127.70 కోట్లు

2025–26లో 8,645 యూనిట్లు – రూ. 129.67 కోట్లు

యూనిఫాం కుట్టింపు ద్వారా ఉపాధి:

2024–25: 1,26,671 యూనిఫాంలు – రూ. 1.89 కోట్లు

2025–26: 83,137 యూనిఫాంలు – రూ. 1.42 కోట్లు

భీమా సాయం:

106 మందికి రుణ భీమా – రూ. 99.20 లక్షలు

20 మందికి ప్రమద భీమా – రూ. 60 లక్షలు

మహిళల ఆధ్వర్యంలోని ఆర్థిక యూనిట్లు

మొబైల్ ఫిష్ అవుట్‌లెట్లు 3, పాల పార్లర్లు 3, ఇందిరా మహిళా సమైక్య క్యాంటీన్లు 5, సోలార్ ప్లాంట్లు 2, పెట్రోల్ బంక్–1 ఏర్పాటు చేశామ‌ని. అదనంగా మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసిన 23 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి ప్రతి బస్సు నెలకు రూ. 70,000 ఆదాయం పొందుతోందని మంత్రి తెలిపారు.

సమాజ శ్రేయస్సు & అభివృద్ధి కార్యక్రమాలు

అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ కమిటీలు: 613

నైపుణ్య శిక్షణలు: 412 మహిళలు

మహిళలు,ఉల్లాస్ విద్యా కార్యక్రమం: 59,299

నమో డ్రోన్ దీదీ శిక్షణ: 44 మహిళలు

ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద 14,567 మందికి రూ. 100.27 కోట్లు మంజూరు ప్రతి మంగళవారం నిర్వహించే తల్లి, శిశు సంరక్షణ & సాధారణ ప్రభుత్వ ఆసుపత్రి సేవల ద్వారా 649 మహిళలు లబ్ధి పొందుతున్నారు అని మంత్రి పేర్కొన్నారు.మొత్తంగా, సంగారెడ్డి జిల్లాలో ఎస్ఈఆర్పీ కార్యకలాపాల ద్వారా గ్రామీణ మహిళల జీవనోపాధి, ఆదాయ వృద్ధి, ఆర్థిక స్వతంత్రత గణనీయంగా పెరుగుతోందని అధికారులు వివరించారు.

ఎస్ఈఆర్పీ అనగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. దీనిని తెలుగులో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అని అంటారు. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికాన్ని తగ్గించడానికి ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేసే ఒక స్వతంత్ర సంస్థ.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్ - Tholi Paluku