Let's talk: editor@tmv.in
కొమురవెల్లి మల్లన్న కళ్యాణోత్సవం వైభవం: మంత్రి పట్టువస్త్రాలు సమర్పణ

కొమురవెల్లి మల్లన్న కళ్యాణోత్సవం వైభవం: మంత్రి పట్టువస్త్రాలు సమర్పణ

Gaddamidi Naveen
15 డిసెంబర్, 2025

సిద్దిపేట జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి (మల్లన్న) వార్షిక కళ్యాణోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సంప్రదాయ వాద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ పండుగ వాతావరణం నెలకొంది.

ఈ శుభ సందర్భంగా స్వామివారికి మంత్రి కొండా సురేఖ‌ పట్టువస్త్రాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మల్లన్న స్వామి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. మల్లన్న స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, సమృద్ధి, ఆయురారోగ్యాలు కలగాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.

ఆల‌యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రత, తాగునీరు, ప్రసాద పంపిణీ వంటి సౌకర్యాలు కల్పించారు. కళ్యాణోత్సవం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఘనంగా కొనసాగనుంది.

కొమురవెల్లి మల్లన్న కళ్యాణోత్సవం వైభవం: మంత్రి పట్టువస్త్రాలు సమర్పణ - Tholi Paluku