Let's talk: editor@tmv.in
కొనసాగుతున్న ‘ఇండిగో’ సంక్షోభం..ప్రయాణికుల కోసం 89 ప్రత్యేక రైళ్లు

కొనసాగుతున్న ‘ఇండిగో’ సంక్షోభం..ప్రయాణికుల కోసం 89 ప్రత్యేక రైళ్లు

Gaddamidi Naveen
8 డిసెంబర్, 2025

ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ వారికి ఉపశమనం కల్పించింది. రాబోయే మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా 89 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.

రైల్వే శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అనేక రూట్లలో ప్రయాణికుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని. ముఖ్యంగా మెట్రో నగరాలు ప్రధాన వ్యాపార కేంద్రాల మధ్య ప్రయాణాలపై ఒత్తిడి అధికమైందని. ఈ నేపథ్యంలో అదనపు రైళ్లు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపింది. సెంట్రల్ రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయని. వాటిలో పూణే,బెంగళూరు, పూణే–ఢిల్లీ, ముంబై–ఢిల్లీ వంటి అత్యంత రద్దీ మార్గాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే ఉన్న షెడ్యూల్ రైళ్లతో కలిసి ప్రవాహాన్ని సమర్థంగా నిర్వహించేందుకు సహాయపడనున్నాయని పేర్కొంది.

అలాగే పశ్చిమ రైల్వేలో భివానీ–ముంబై, ముంబై–షకుర్‌బస్తీ వంటి ప్రయాణ మార్గాలపై మొత్తం 7 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ఉత్తర–పశ్చిమ ప్రాంతాల నుంచి ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాలకు ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో ఈ రూట్లను ప్రాధాన్యంగా గుర్తించారు. మొత్తం గా, ప్రత్యేక రైళ్ల నిర్వహణతో అత్యవసర ప్రయాణాలు చేపట్టాల్సిన వారికీ, ముందుగా టికెట్లు పొందలేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకూ ఉపశమనం లభించనుంది. రైల్వే శాఖ ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జోన్లు సమన్వయంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.

కొనసాగుతున్న ‘ఇండిగో’ సంక్షోభం..ప్రయాణికుల కోసం 89 ప్రత్యేక రైళ్లు - Tholi Paluku