Let's talk: editor@tmv.in
కొత్త చట్టాల వల్ల సత్వర న్యాయం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కొత్త చట్టాల వల్ల సత్వర న్యాయం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Pinjari Chand
14 అక్టోబర్, 2025

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ శిక్షాస్మృతి-2023 వలన ప్రజలకు సత్వరమే న్యాయం అందుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం రాజస్థాన్ లో కొత్త క్రిమినల్ చట్టాలపై నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 180 సంవత్సరాల పురాతన చట్టాలను తొలగించి ప్రధాని నరేంద్రమోడీ కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చారన్నారు. 2027 కల్లా ఏదైనా కేసు నమోదైతే 3 సంవత్సరాల్లో పు సుప్రీం కోర్టులో కూడా పరిష్కరమయ్యేలా చట్టాలు రూపొందించామన్నారు. మీకు సులభంగా, సరళంగా న్యాయం అందేలా రాబోయే చట్టాలు ఉన్నాయన్నారు. ఇవి వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వాళ్లు రూపొందించిన చట్టాలను తొలగించి, భారత పార్లమెంట్ లో అనేక చర్చల ద్వారా ఈ 2023 చట్టాలను రూపొందించామన్నారు. సుప్రీం,హైకోర్టు ఐపీఎస్, ఐఏయస్, తదితర ఉన్నతాధికారులతో ప్రతిరోజూ సమావేశమై మూడు సంవత్సరాల పాటు శ్రమించి చారిత్రకమైన ఈ చట్టాలను తీసుకొచ్చామన్నారు.

రాజస్థాన్‌లో గత సంవత్సరం మాత్రమే ఈ చట్టాలు అమలులోకి వచ్చినప్పటి నుంచి తీర్పుల రేటు 42శాతానికి నుంచి 60శాతానికి పెరిగింది. చట్టాలను పూర్తిగా అమలు చేసిన తర్వాత ఇది 90శాతానికి చేరుతుందని ఆయన చెప్పారు. అమిత్ షా కొత్త చట్టాల్లో శాస్త్రీయ పద్ధతులు వినియోగించే విధానాన్ని కూడా గుర్తుచేశారు. 2020లో ఏర్పాటు చేసిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా, ఈ చట్టాల అమలు సజావుగా జరగడానికి అవసరమైన యువ శాస్త్రీయ సిబ్బంది సిద్ధం అవుతున్నారు. కొత్త చట్టాల్లో ఉగ్రవాదం, మాబ్ లించింగ్, డిజిటల్ క్రైమ్ మొదలైనవి కూడా కొత్తగా చేర్చాం. ఈ చట్టాల్లో 29 చోట్ల సమయం గురించి వివరించాం. తొమ్మిది రోజుల్లో బాధితులకు కేసుకు సంబంధించి అప్డేట్ ఇవ్వాలి, 14 రోజుల్లో పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. 60–90 రోజుల్లో చార్జీషీట్ ఇవ్వాలి. ఎవరైనా దేశం విడిచిపోతే కూడా వారికి శిక్షపడేలా చట్టాలున్నాయన్నారు. 21 శతాబ్దంలోనే ఈ మూడు చట్టాలు గొప్ప సంస్కరణలని ప్రశంసించారు. ఈ చట్టాలపై పోలీసులకు, ఫొరెన్సిక్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు.

భారత ప్రభుత్వం భారతీయ న్యాయ సంహితా చట్టం (బీఎన్ఎస్),భారతీయ సాక్ష్యాధినియం (బీఎస్ఎస్), భారతీయ నగరిక సురక్షా సంహితా (బీఎన్ఎస్సెస్), 2023 క్రిమినల్ చట్టాలను కొత్తగా ప్రవేశపెట్టింది. అంతేకాక అమిత్ షా రూ9,315 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను ప్రారంభించారు. శంకుస్థాపనలు కూడా చేశారు.

కొత్త చట్టాల వల్ల సత్వర న్యాయం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా - Tholi Paluku