
కొత్త కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల (కేవీఏస్) ప్రారంభానికి ఆమోదం లభించింది. ఈ విద్యాలయాలు 86,000 మందికి పైగా విద్యార్థులకు లాభం చేకూరుస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ముఖ్యాంశాలు
మొత్తం కొత్తగా 57 కేవీలు వీటిలో 7 హోంశాఖ ప్రాయోజితంగా, మిగిలిన 50 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఆధ్వర్యంలో ఏర్పాటు అవుతాయి. ఈ విద్యాలయాల్లో 20 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేవీ లేకపోవడం విశేషం. బాల వాటికలు ప్రాథమిక స్థాయిగా ఈ కొత్త కేవీల్లో తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు.ఇదిNEP 2020 (జాతీయ విద్యా విధానం)లో భాగంగా ఒక ప్రధాన అడుగు. ఈ 57 కేవీలకు రూ. 5,862.55 కోట్లు వ్యయంగా అంచనా వేసారు (2026-27 నుండి 9 సంవత్సరాల కాలానికి). ఇందులో రూ. 2,585.52 కోట్లు మూలధన వ్యయం,రూ. 3,277.03 కోట్లు నిర్వహణ వ్యయంగా పరిగనించారు.
ఉద్యోగావకాశాలు:
ఒక్క కేవీకి సుమారు 81 ఉద్యోగాలు. 57 కేవీలతో కలిపి 4,617 కొత్త ఉద్యోగాలు (permanent). నిర్మాణ పనుల ద్వారా అనేక మంది నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి అవకాశాలు.
