
కొత్తగూడెం ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీలు
Gaddamidi Naveen
9 ఫిబ్రవరి, 2026
భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని వసతులు, రికార్డులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్పత్రి యాజమాన్యాలకు పలు కీలక సూచనలు చేస్తూ.. రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సేవల వివరాలను, ఫీజుల జాబితాను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ తనిఖీల ద్వారా వైద్య సేవలపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
