
కొణిదెల గ్రామానికి మహర్దశ: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం
తన ఇంటి పేరును పంచుకున్న గ్రామంపై ఉన్న మమకారాన్ని ఆ ఊరి ప్రజలకు ఇచ్చిన హామీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో ప్రకటించిన ఆయన ఆ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. సొంత విరాళంతో పాటు ప్రభుత్వ నిధులను సమన్వయం చేస్తూ సుమారు రూ.6 కోట్లతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు.
2019 ఎన్నికల సమయంలో కొణిదెల గ్రామస్తుల విన్నపం మేరకు ఆ ఊరిని దత్తత తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గత ఏడాది పర్యటనలో భాగంగా గ్రామాభివృద్ధి కోసం రూ.50 లక్షల వ్యక్తిగత విరాళాన్ని అందజేశారు. గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న తాగునీటి ఎద్దడిని గుర్తించిన అధికారులు, ఆ నిధులతో 90,000 లీటర్ల సామర్థ్యం గల రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు. వే
మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మక మార్పులు
కేవలం తాగునీటికే పరిమితం కాకుండా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు పవన్ కళ్యాణ్ గారు పెద్దపీట వేశారు. ‘పల్లె పండుగ’ 1.0, 2.0 కింద సుమారు రూ. 65 లక్షలతో సి.సి. రోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ నిధులతో కొణిదెల జెడ్పీ హైస్కూల్ నుంచి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బి.టి. రోడ్డు నిర్మాణం కోసం ఏకంగా రూ. 4 కోట్లు మంజూరు చేయించారు.
గ్రామస్తుల ప్రతి చిన్న విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ఉప ముఖ్యమంత్రి ఉపాధి హామీ పథకం కింద రైతులకు మేలు చేసేలా 49 ఫీడర్ ఛానల్స్‌ను అభివృద్ధి చేయించారు. పశువుల సంరక్షణ కోసం 4 గోకులాలు, 19 పక్కా ఇళ్లు, సాగునీటి కాలువల పునరుద్ధరణ మూడు కమ్యూనిటీ చెక్ డ్యామ్‌ల మరమ్మతులు పూర్తి చేయించారు.
