
కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
Gaddamidi Naveen
11 ఫిబ్రవరి, 2026
తెలంగాణ వ్యాప్తంగా నేడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వికారాబాద్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆయన ఓటు వేయనున్నారు.
షెడ్యూల్ ప్రకారం, నేడు ఉదయం 11:30 గంటలకు కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సీఎం ఓటు వేస్తారు. ఓటు వేసిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13న వెలువడనున్నాయి.
