Let's talk: editor@tmv.in
కైరో ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఈషా సింగ్‌కు అభినందనలు

కైరో ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఈషా సింగ్‌కు అభినందనలు

Dantu Vijaya Lakshmi Prasanna
16 నవంబర్, 2025

కైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని అన్నారు. షూటింగ్‌లో పట్టుదలతో సాధన చేస్తున్నఈషాసింఘ్ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరింతగా రాణించాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. ఈ విజయం హైదరాబాద్‌కు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.

ఈషా సింగ్ ముఖ్య విజయాలు

తెలంగాణకు చెందిన యువ షూటర్ ఈషా సింగ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సీనియర్, జూనియర్ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది.

• కైరో ప్రపంచ చాంపియన్‌షిప్ (తాజా విజయం)మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. వ్యక్తిగత సీనియర్ స్థాయిలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమెకు ఇదే తొలి పతకం.

• ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ (మిక్స్‌డ్ టీమ్)లో సమ్రాట్ రానాతో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో రజత పతకం (2025) గెలుచుకుంది.

• శివ నర్వాల్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో స్వర్ణ పతకం (2023).

• ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ (ఉమెన్ టీమ్): మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్‌లో స్వర్ణ పతకం (2023).

• కైరో ప్రపంచ చాంపియన్‌షిప్ (జూనియర్): 2022లో జరిగిన జూనియర్ విభాగంలో 25 మీటర్ల పిస్టల్‌లో స్వర్ణం సాధించి జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

• ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ నింగ్బో వరల్డ్ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం, బ్యూనస్ ఎయిర్స్ వరల్డ్ కప్‌లో 25 మీటర్ల పిస్టల్‌లో రజతం గెలుచుకుంది.

• ఆసియా క్రీడలులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజత పతకం సాధించింది.

• జాతీయ స్థాయిలో కేవలం 13 ఏళ్ల వయసులోనే 2018లో జాతీయ చాంపియన్‌గా నిలిచింది.

• ఆమె ప్రతిభకు గుర్తింపుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును అందుకుంది.

కైరో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారతదేశం సాధించిన పతకాలు

కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ రైఫిల్ 2025 లో భారతీయ బృందం మొత్తం 12 పతకాలను సాధించింది.

భారతదేశం సాధించిన మొత్తం పతకాల వివరాలు:

• స్వర్ణ పతకాలు- 3

• రజత పతకాలు- 5

• కాంస్య పతకాలు- 4

ముఖ్య పతక విజేతలు:

సమ్రాట్ రానా:

• మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం సాధించి, ఒలింపిక్ విభాగంలో వ్యక్తిగత ప్రపంచ టైటిల్ గెలిచిన మొదటి భారతీయ పిస్టల్ షూటర్‌గా నిలిచాడు.

ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్:

• మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3P (3 పొజిషన్స్) లో రజతం సాధించాడు.

అనిష్ భన్వాలా:

• మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో రజతం గెలుచుకున్నాడు.

• వరుణ్ తోమర్: మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించాడు.

సమ్రాట్ రానా - ఈషా సింగ్ జంట:

• 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో రజత పతకం గెలుచుకున్నారు.

కైరో ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఈషా సింగ్‌కు అభినందనలు - Tholi Paluku