
కేసీఆర్‌ది ముందు చూపు.. కాంగ్రెస్‌ది మంద బుద్ధి
రాష్ట్రాన్ని కేసీఆర్ ముందు చూపుతో ప్రగతిపథంలో నడిపిస్తే చేతగాని రేవంత్ రాష్ట్రాన్ని అధోగతి పలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తదితరులతో టీమ్స్ ఎల్బీనగర్ ఆస్పత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ " తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో హైదరాబాద్ చుట్టూ నలువైపులా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు నిర్మించతలపెట్టారు. టిమ్స్‌లతో పాటు, నిమ్స్ రెండు వేల పడకల ఆసుపత్రి నిర్మించాలని శంకుస్థాపన చేశారు. గతంలో అనేక ప్రభుత్వాలు పని చేసినా నిజాం కాలంలో కట్టిన గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి ఆసుపత్రులే ఉన్నాయి. కేసీఆర్ పేదల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు చేరువ చేసేలా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ పనులను ప్రారంభించారు. అన్ని నిధులు కేటాయించారు, పనులు దాదాపుగా పూర్తి చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ముందుకు పోవడం లేదు." అని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో భూసేకరణ, టెండర్లు, డిజైన్లు పూర్తి అయ్యాయి. నిధులు ఇచ్చింది. ఇవన్నీ పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. సెల్లార్ తో కలుపుకొని 6 అంతస్తుల భవనం ఎల్బీ నగర్ టిమ్స్ పనులను బిఆర్ఎస్ సర్కారు పూర్తి చేసింది. కానీ ఈ కాంగ్రెస్ వచ్చాక
రెండేళ్లలో 5 అంతస్తులు మాత్రమే పూర్తి చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఆసుపత్రి ప్రారంభమై, ప్రజలకు సేవలు అందించేది. కేసీఆర్ కు పేరు వస్తుందని, బిఆర్ఎస్ చేసిన మంచిని ప్రజలు గుర్తు చేసుకుంటారనే దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఆసుపత్రి నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నారు.
ముందు చూపు లేని మంద బుద్ధి నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎందుకు పనులు పూర్తి చేయడం లేదు, ఉన్న పనులు ఎందుకు ఆపుతున్నారు? టిమ్స్ ఆసుపత్రుల కోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తెచ్చాం. కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కునేలా కేసీఆర్ ప్రణాళికలు రచించారు. మొత్తంగా పది వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని చూసారు.
వందేళ్ల ముందు చూపుతో ప్రణాళికలు వేసారు. కేసీఆర్ గారు 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండేలా ప్లాన్ చేసారు. 2850 ఎంబీబీఎస్ సీట్లను 10 వేలకు పెంచారు. మేము మహేళ్వరం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే, జీవో జారీ చేస్తే, దాన్ని రద్దు చేసారు. శంకుస్థాపన చేసిన కాలేజీని రద్దు చేసి, టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలనే లక్ష్యాన్ని నీరు గార్చారు" అని ధ్వజమెత్తారు.
ఇంకా హరీష్ రావు మాట్లాడుతూ, మహేళ్వరంలో మెడికల్ కాలేజీ లేకుండా చేసారు. అదే విధంగా కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే, దాన్ని టిమ్స్ అల్వాల్ లో కలిపేసారు కేసీఆర్ అల్వాల్ లో మెడికల్ కాలేజీతో పాటు, 500 పడకల ఆసుపత్రి రావాలని చూసారు. కానీ మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజీ, 500 పడకలు ఆసుపత్రి లేకుండా చేసారు. కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్యల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం రెండేళ్లు అయినా ఆసుపత్రుల పనులు పూర్తి చేయడం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలు చేస్తే చేయండి, మా మీద కేసులు పెట్టండి. కానీ ఆసుపత్రుల నిర్మాణాలు ఆపితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది"అని హెచ్చరించారు. రాజకీయాల కోసం ఆసుపత్రుల నిర్మాణాలు ఆపడం దుర్మార్గం అని అన్నారు.
“రెండేళ్లలో 5 స్లాబులు వేస్తవా? డెడ్ లైన్లు, డేట్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణాలు మారడం లేదు. కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రీషన్ కిట్ బంద్, తిట్ల మీద రేవంత్ కు ఉన్న ప్రేమ, కిట్ల మీద లేదు. ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలను 30 నుంచి 72 శాతానికి పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి 55 శాతానికి తగ్గించారు. పేదలకు వైద్యంలో తిరోగమనం, ప్రభుత్వ విద్యలో తిరోగమనం, జీఎస్టీ వృద్దిలో తిరోగమనం, రియల్ ఎస్టేట్ లో తిరోగమనం.. రేవంత్ పాలనలో రాష్ట్రం వెనక్కిపోతోంది. 47 వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు. ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 55 శాతానికి తగ్గాయి. జీఎస్టీ 5శాతం మైనస్ కు పోయింది. కేసీఆర్ హయాంలో 16 శాతం పెరిగింది. కానీ రేవంత్ పాలనలో అంతా తిరోగమనమే. కేసీఆర్ 450 బస్తీ దవాఖానలు ప్రారంభించారు. కేంద్రం, 15వ ఆర్థిక సంఘం తెలంగాణను మెచ్చుకుంది. రేవంత్ పుణ్యమా అని బస్తీ దవాఖానలో పని చేసే డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఉద్యోగులకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు. కేసీఆర్ ప్రారంభించిన బస్తీ దవాఖానలు మూత పడాలే అన్నదే రేవంత్ లక్ష్యమా? హైదరాబాద్‌లోనే 350 బస్తీ దవాఖానలు పెట్టారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెబుతావు రేవంత్ రెడ్డి? 108 మందుల్లో సగం కూడా ఇవ్వడం లేదు. బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిండు రేవంత్ రెడ్డి" అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
