Let's talk: editor@tmv.in
కేరళ మహిళలు దేశానికి నాయకత్వం వహించారు: రాష్ట్రపతి ముర్ము

కేరళ మహిళలు దేశానికి నాయకత్వం వహించారు: రాష్ట్రపతి ముర్ము

Pinjari Chand
25 అక్టోబర్, 2025

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కాలేజ్ శతాబ్దోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెయింట్ థెరిసా కళాశాల భారతదేశంలో మహిళా విద్యను, ఆధ్యాత్మిక విలువలను బలమైన నిబద్ధతతో ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇది సామాజిక పరివర్తన, జాతి నిర్మాణానికి గొప్ప సహకారం. దీంతో ఈ సంస్థను నిర్మించి, శతాబ్దాల పాటు నిరంతర విజయాల ద్వారా నడిపించిన విశిష్ట వ్యక్తుల దార్శనికత, వారసత్వాన్ని మనం లోతుగా గుర్తించాలన్నారు. ఈ కాలేజ్ మహిళా విద్యలో స్థిరమైన కృషితో, ఆధ్యాత్మిక విలువలను ప్రోత్సహిస్తూ, సమాజ మార్పు, దేశ నిర్మాణానికి గొప్ప సేవలు అందించిందని పేర్కొన్నారు.

కేరళకు చెందిన మహిళలు దేశానికి నాయకత్వం వహించారని రాష్ట్రపతి గుర్తు చేశారు. రాజ్యాంగ సభలోని పదిహేను మంది మహిళా సభ్యులు భారత రాజ్యాంగ రూపకల్పనలో తమ దృక్పథాన్ని జోడించారు. ఆ పదిహేను మంది అత్యుత్తమ మహిళలలో ముగ్గురు కేరళకు చెందినవారు ఉన్నారు. అమ్ము స్వామినాథన్, అన్నీ మస్కరీన్, దాక్షాయణి వేలాయుధన్ ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం, లింగ సమానత్వంతో పాటు అనేక ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చలను ప్రభావితం చేశారన్నారు.

న్యాయ రంగంలో జస్టిస్ ఆన్నా చాండి: 1956లో కేరళ హైకోర్ట్ జడ్జ్ గా, జస్టిస్ ఎం. ఫాతిమా బీవీ: 1989లో భారత సుప్రీం కోర్ట్ లో మొదటి మహిళా జడ్జ్ గా పనిచేశారని గుర్తు చేశారు.

సెయింట్ థెరిసా కళాశాలలోని చురుకైన మహిళా విద్యార్థులు యువ , అభివృద్ధి చెందుతున్న, శక్తివంతమైన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. దేశం జనాభా ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి మహిళల చురుకైన భాగస్వామ్యం అవసరమని ఆమె నొక్కి చెప్పారు. బడ్జెట్ కేటాయింపులో కూడా మహిళలకు 10 ఏళ్లలో 4.5 రెట్లు పెరిగింది. మహిళల ఆధ్వర్యంలోని ఎంస్ఎంఈలు 2011–2024 మధ్య రెట్టింపయ్యాయన్నారు. 2047 నాటికి మహిళా వర్క్‌ఫోర్స్ 70శాతం చేరుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రాజెక్టు స్లేట్

విద్య ద్వారా స్థిరత్వం, నాయకత్వం, ఏజెన్సీని ప్రోత్సహించడానికి స్లేట్ అనే ప్రాజెక్ట్‌ను సెయింట్ థెరిసా కళాశాల చేపట్టిందని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. స్లేట్ ( సస్టైనబిలిటీ, లీడర్షిప్ అండ్ ఏజెన్సీ థ్రో ఎడ్యుకేషన్ ) ప్రాజెక్ట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 లక్ష్యాలను సమర్ధవంతంగా అనుసరించడం, యువతను సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లక్ష్యాలకనుగుణంగా అనుసంధానించడం, భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడం ముఖ్య లక్ష్యాలుగా పేర్కోన్నారు. ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ భారత్ ను జ్ఞాన-సూపర్ పవర్ గా తీర్చడంలో కీలకంగా ఉంటాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. అదే వేదికపై అధ్యక్షురాలు విద్య లింగ సమానత్వం, మహిళా సాధికారతలో భారతదేశం సాధించిన పురోగతిని ప్రత్యేకంగా గుర్తించారు.

సెయింట్ థెరిసా కాలేజ్ ను ఎర్నాకులంలో 1925లో స్థాపించారు. ఇది కేరళ రాష్ట్రంలోని కోచిన్ లో స్థాపించిన మొదటి మహిళా కళాశాల. ఈ కళాశాల స్థాపనకు కార్మెలైట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ టెరిసా బాధ్యత వహించారు. మాతృమాతా థెరిసా ఆఫ్ సెయింట్ రోస్ ఆఫ్ లిమా వారి దార్శనికత ఆధారంగా ఈ కళాశాల స్థాపించారు. కళాశాల ప్రారంభంలో, 41 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఈ కళాశాల 2025లో తన శతాబ్దోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కేరళ మహిళలు దేశానికి నాయకత్వం వహించారు: రాష్ట్రపతి ముర్ము - Tholi Paluku