
కేరళ నటి కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించాలి: ప్రాసిక్యూషన్
ఇటీవల కేరళనటి లైంగిక వేధింపుల కేసులో కేరళ కోర్టు నలుగురిని నిందితులను నిర్దోషులుగా తేలుస్తూ వారిని విడుదల చేసింది. అయితే అందులో మిగిలిన ఆరుగురిపై ఘటనలో పాల్గోన్నరన్న బలమైన ఆధారాలు ఉండడంతో వారికి జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టును అడగనుంది.
2017 నటి లైంగిక వేధింపు కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ కోరనుంది. శుక్రవారం శిక్షపై విచారణ జరగనుందని అధికారులు తెలిపారు. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ డిసెంబర్ 8న మొదటి ఆరుగురు నిందితులు — సునీల్ ఎన్ఎస్ (పల్సర్ సునీ), మార్టిన్ ఆంటోనీ, మణికండన్ బి, విజేష్ విపి, సలీం హెచ్, ప్రదీప్ — దోషులని తీర్పు ఇచ్చారు. నటుడు దిలీప్, చార్లీ థామస్, సనీల్ కుమార్ (మెస్త్రీ సనీల్), శరత్‌లను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి అజా కుమార్ మాట్లాడుతూ, దోషులకు అత్యధిక శిక్ష అయిన జీవిత ఖైదు విధించాలని కోరతామని, అత్యాచారం, కుట్ర, సహాయం కింద ఇది వర్తిస్తుందని చెప్పారు.
గరిష్ఠ శిక్షను కోరుతాం. ట్రయల్‌లో దీనికి సాక్ష్యాలు సమర్పించామని ఆయన అన్నారు. కోర్టు దోషులను భారతీయ శిక్షాస్మృతి (ఆ సమయంలో ఉన్నది) ఐటి చట్టం కింద క్రిమినల్ కుట్ర, అక్రమ నిర్బంధం, సామూహిక అత్యాచారం, మహిళను అపహరించడం, సహాయం, మహిళ మర్యాదను దెబ్బతీసేలా బలవంతం చేయడం వంటి నేరాలకు దోషులని తేల్చింది.
తీర్పు కాపీ వచ్చాక స్పందిస్తాం
దిలీప్‌ను ఎందుకు నిర్దోషిగా విడుదల చేశారనే కారణాలను తెలుసుకోవడానికి తీర్పు కాపీ కోసం ఎదురుచూస్తున్నామని కుమార్ చెప్పారు. తీర్పు కాపీ వచ్చిన తర్వాతే కారణాలు తెలుస్తాయి. దీన్ని ప్రాసిక్యూషన్ వైఫల్యంగా చెప్పడం సరికాదని ఆయన అన్నారు.
నలుగురు నిందితులు నిర్దోషికి వ్యతిరేకంగా కేరళ హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని, తీర్పు కాపీ వచ్చిన వెంటనే అప్పీల్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.2017 ఫిబ్రవరి 17 రాత్రి నటి కారులోకి బలవంతంగా ఎక్కి రెండు గంటల పాటు నియంత్రణలో ఉంచి లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ ఘటన కేరళ సమాజంలో కలకలం రేపింది. ప్రాసిక్యూషన్ ప్రకారం, ఆ రాత్రి కొందరు వ్యక్తులు వాహనంలోకి ఎక్కి, జనసాంద్రత ఉన్న ప్రాంతంలో కారును వదిలివేసి పారిపోయారు.
