
కేరళలో ఐఎండీ అరెంజ్ అలర్డ్
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య ఋతుపవనాల వలన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. మృత్య్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. చిన్న సంఘటనలు మినహా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
కేరళలో పది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
భారత వాతావరణ విభాగం బుధవారం కేరళలోని పతనంతిట్ట, ఆలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిశూర్, పాలక్కాడ్, మల్లపురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఇడుక్కి, పాలక్కాడ్, మల్లపురం జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ దానిని ఉపసంహరించి ఆరెంజ్ కేటగిరీకి మార్చింది.
అదేవిధంగా కాసరగోడ్, కన్నూరు, కొల్లం, తిరువనంతపురం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసి వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాలు, గాలుల కారణంగా ఇడుక్కి, పాలక్కాడ్, మల్లపురం, పతనంతిట్ట జిల్లాల్లోని విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. అలాగే, ఇడుక్కి జిల్లాలో రాత్రి ప్రయాణాలను నిషేధించారు.
దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడులోనూ
తమిళనాడు తీరానికి సమీపంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ సందర్భంగా తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రుతుపవనాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీరు నిలుస్తున్నప్పటికి గంటలోపే నీరు మురుగులోకి వెళ్లిపోతోంది. ప్రజలు మమ్మల్ని కోపంతో కాదు నమ్మకంతో పిలుస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది అని తెలిపారు.చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టు జిల్లాల్లో నిరటకంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల్లో వర్షం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఏడాదికంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.తమిళనాడులోని 8 జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవిచ్చారు.
మున్సిపల్ పరిపాలన మంత్రి కె.ఎన్. నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలు, తక్షణ చర్యలు, తదితర అంశాలపై చర్చ జరిగింది.
