Let's talk: editor@tmv.in
కేటీఆర్ బెదిరింపులతో నా భూమి కబ్జా: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపణలు

కేటీఆర్ బెదిరింపులతో నా భూమి కబ్జా: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపణలు

Gaddamidi Naveen
30 మార్చి, 2026

తెలంగాణ శాసనసభలో భూమి సమస్యలపై జరిగిన చర్చ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కష్టార్జితంతో సంపాదించిన భూమిని కేటీఆర్ అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన నిలదీశారు.

ఈ వ్యవహారంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ అన్యాయం జరిగినప్పటికీ, అప్పట్లో ఉన్న భయాందోళనల కారణంగానే తాము మౌనంగా ఉండాల్సి వచ్చిందని దానం పేర్కొన్నారు. ఇప్పుడు భూకబ్జాలు, అక్రమ లావాదేవీలపై ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూ అక్రమాలపై వాస్తవాలను వెలికితీసేందుకు తక్షణమే హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను అసెంబ్లీ ముందు ఉంచుతానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తన సొంత భూమి విషయంలోనే కేటీఆర్‌పై ఇటువంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.