
కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను జట్టు అసిస్టెంట్ కోచ్‌గా నియమించినట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఆటగాడిగా ఐపీఎల్‌లో చెరగని ముద్ర వేసిన షేన్ వాట్సన్, ఇప్పుడు కోచ్ పాత్రలో కేకేఆర్‌లో కనిపించనున్నాడు. 44 ఏళ్ల వాట్సన్ ఐపీఎల్ 2026 నుంచి అసిస్టెంట్ కోచ్‌గా తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. వాట్సన్ ఇప్పటికే వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లలో కోచ్ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), ఇతర లీగ్‌లలో హెడ్ కోచ్‌గా, మెంటార్‌గా పనిచేశాడు.
కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా అవతారమెత్తిన వాట్సన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటి ఐకానిక్ ఫ్రాంచైజీలో భాగం కావడం గొప్ప గౌరవం" అని కేకేఆర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. కేకేఆర్ కోచింగ్ గ్రూప్, ప్లేయర్స్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కోల్‌కతాకు మరో టైటిల్‌ను తీసుకువచ్చేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
షేన్ వాట్సన్ కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా, కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని హ్యాండిల్ చేయడంలో దిట్ట. అతడి అనుభవం కేకేఆర్ యువ ఆటగాళ్లకు, ముఖ్యంగా ఆల్‌రౌండర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది.
ఐపీఎల్ కెరీర్
వాట్సన్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 145 మ్యాచ్‌లలో ఆడాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్‌కు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో 3,500కు పైగా పరుగులు చేసి, 92 వికెట్లు తీశాడు.
ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అభిషేక్ నాయర్ హెడ్ కోచ్‌గా, డ్వేన్ బ్రావో మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. వాట్సన్ రాకతో, కేకేఆర్ డగౌట్‌లో వ్యూహాత్మక ఆలోచనలు, ఆటగాళ్ల మానసిక సంసిద్ధత మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో షేన్ వాట్సన్‌కు ఉన్న అనుభవం, రాబోయే సీజన్లలో కేకేఆర్ ఆటతీరును, ముఖ్యంగా టైటిల్ గెలుచుకునే అవకాశాలను ఎంతవరకు మెరుగుపరుస్తుందో వేచి చూడాలి.
