Let's talk: editor@tmv.in
కేంద్ర ప్రభుత్వం ఒకే మతాన్ని టార్గెట్‌ చేస్తోంది:కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సందీప్‌ దీక్షిత్‌

కేంద్ర ప్రభుత్వం ఒకే మతాన్ని టార్గెట్‌ చేస్తోంది:కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సందీప్‌ దీక్షిత్‌

Pinjari Chand
24 నవంబర్, 2025

దేశంలో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాన్ని జామియత్‌ ఉలమా–ఎ–హింద్‌ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదనీ ప్రస్తావించడంతో ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ పూర్తిగా సమర్థించారు. ఈ ప్రభుత్వం ఒకే మతాన్ని వ్యవస్థాత్మకంగా టార్గెట్‌ చేస్తోందంటూ దీక్షిత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా, ఆ మతంతో సంబంధం ఉన్న విద్యావంతులు, మేధావులకు వ్యతిరేకంగా చాలా క్రమబద్ధమైన ప్రచారాన్ని ప్రారంభించింది. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కొన్నిసార్లు, దానితో సంబంధం ఉన్న వ్యక్తులు తమను అన్యాయంగా చూస్తున్నారని భావిస్తారు అని దీక్షిత్ అన్నారు.

బీజేపీలో ముస్లింలకు చోటే లేదు

బీజేపీలో ముస్లింల ప్రాతినిధ్యం దాదాపు శూన్యమైందని ఆయన విమర్శించారు. ఇస్లాం మతం నమ్మే ప్రతిభావంతులెందరో ఉన్నా పేరులో ముస్లిం ఉండడంతోనే వారిలో చాలామంది విసుగు, నిరాశకు గురవుతున్నారు అని దిక్షిత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మదనీ వ్యాఖ్యలను అల్‌–ఫలాహ్‌ వ్యవహారంతో పోల్చడం సరైంది కాదని తెలిపారు. కేసులు వేరే, మత వివక్ష వేరే. అల్‌–ఫలాహ్‌ ఇష్యూ దాని ప్రత్యేక పరిస్థితుల్లోనే పరిశీలించాలి అని ఆయన అన్నారు.

విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి

అల్ ఫలా వైద్యులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్వహిస్తున్న దర్యాప్తును ప్రస్తావిస్తూ, నిర్దిష్ట కేసులలో న్యాయమైన దర్యాప్తు అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఎన్ఐఏ నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహిస్తుందని నేను ఆశిస్తున్నాను. వారు ఏదైనా తప్పు చేసినట్లు కనుగొంటే, దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. నిరపరాధులను జైలులో పెట్టే పరిస్థితి రాకూడదు అని దీక్షిత్ అన్నారు.

వివక్షత గురించి మదాని విస్తృత ఆందోళనలతో ఏకీభవిస్తూనే, తీర్మానాలు చేసే ముందు వ్యక్తిగత కేసుల వెనుక ఉన్న సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సమాజాన్ని, ఎన్ఐఏ అధికారులను కోరారు. విచారణ పూర్తిగా న్యాయబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

మదనీ అభ్యంతరాలు సమాజం ఆలోచించాల్సినవే

మదనీ ఇటీవల ముస్లింలపై జరుగుతున్న వివక్షను ప్రస్తావించిన విషయాన్ని ఆయన సమర్థించారు. మదనీ ఈ సందర్భంగా అజమ్‌ ఖాన్‌ కేసు, అల్‌–ఫలాహ్‌ విశ్వవిద్యాలయం వ్యవహారం, డాక్టర్ల అరెస్టుల వంటి ఉదాహరణలను ఇచ్చినట్లు గుర్తుచేశారు.

ప్రపంచం మొత్తంలో ముస్లింలు బలహీనులయ్యారన్న భావన తప్పు. న్యూయార్క్‌లో జోహ్రాన్‌ మమ్దాని, లండన్‌లో సాదిక్‌ ఖాన్‌ మేయర్లుగా ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తించాలి” అని పేర్కొన్న అంశాన్ని దీక్షిత్‌ సమర్థించారు.

ముస్లిం వీసీ అయితే… జైలుకే పంపుతారా?

ఈ దేశంలో ముస్లిం వ్యక్తి ఉపకులపతి అయ్యే అవకాశం లేదు. అయినా వెంటనే జైలుకు పంపిస్తారని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం ఒకే మతాన్ని టార్గెట్‌ చేస్తోంది:కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ - Tholi Paluku