
కేంద్రం దృష్టికి ఏపీ విద్య–స్కిల్ అజెండా
రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక రంగాల్లో వేగవంతమైన పురోగతి సాధించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక స్థాయి చర్చలు నిర్వహించారు. ఇటీవల అమెరికా పర్యటనలో గ్లోబల్ టెక్ సంస్థలతో ఉన్నతస్థాయి సమావేశాలు ముగించుకున్న అనంతరం ఢిల్లీకి చేరుకున్న ఆయన, రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు,ఆధునిక సాంకేతికతను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జరిగిన సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పథకం అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన క్లికర్ ఆధారిత ఇంటరాక్టివ్ క్లాస్‌రూమ్ విధానం కడపలో ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వ నిర్వహణలోని సెంట్రల్ స్మార్ట్ కిచెన్ వంటి కీలక కార్యక్రమాలను మంత్రి లోకేష్ వివరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్ స్కూల్ లెజిస్లేచర్’ పేరిట విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించడమే కాకుండా భారత పిల్లల రాజ్యాంగాన్ని విడుదల చేసిన అంశాన్ని కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు.
అదేవిదంగా రాష్ట్రంలో 11 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు కోసం అనుమతి ఇవ్వాలని, అయితే ఇప్పటికే కేటాయించిన 12 కేంద్రీయ విద్యాలయాలను త్వరితగతిన కార్యాచరణలోకి తీసుకురావాలని లోకేష్ కోరారు. స్టార్స్ ప్రాజెక్టు కింద రూ.4,400 కోట్ల నిధులు, 2025–26కు అదనంగా రూ.1,270 కోట్ల మంజూరుకు విజ్ఞప్తి చేశారు. పీఎం పోషణ్ పథకం కింద ప్రయోగాత్మకంగా 155 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, గుంటూరు జిల్లా చిన్నకాకానిలో ఏర్పాటు చేస్తున్న మోడల్ ఆటిజం సపోర్ట్ సెంటర్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాన్‌ను ఆహ్వానించారు.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి జయంత్ చౌధరీతో జరిగిన సమావేశంలో విశాఖపట్నంలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం అనుమతి కోరారు. పేదగంట్యాడలో ఐదు ఎకరాల స్థలాన్ని రాష్ట్రం ఇప్పటికే గుర్తించిందని, ఈ సంస్థ అధ్యాపకుల శిక్షణ, పరిశ్రమల అనుసంధాన నైపుణ్యాలు, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ప్రాంతీయ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు.
ఇక అమెరికా పర్యటనలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్‌విడియా, అడోబ్ వంటి ప్రముఖ సంస్థల నేతలతో జరిగిన చర్చల ఫలితాలను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లోకేష్ వివరించారు. అమెరికన్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు చూపుతున్న ఆసక్తిని ఆయన తెలియజేశారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకార
ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన లోకేష్ గ్లోబల్ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి ద్వారా రాష్ట్ర యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయాన్ని బలోపేతం చేయడమే న్యూఢిల్లీ పర్యటన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
