Let's talk: editor@tmv.in
కుల వివక్షకు ఐపీఎస్ అధికారి బలి

కుల వివక్షకు ఐపీఎస్ అధికారి బలి

Panthagani Anusha
10 అక్టోబర్, 2025

చండీగఢ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ( 52) తన నివాసంలో అక్టోబర్ 7న అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు. అయితే పూరణ్ కుమార్ చనిపోవడానికి ముందు రాసిన ఒక లెటర్ ఈ కేసులో కీలక పరిణామాలకు దారితీసింది. ఇకపోతే పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారుల ప్రవర్తన కుల ఆధారిత వివక్ష, మానసిక వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి అన్న విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ఇదిలా ఉండగా పూరణ్ కుమార్ తన సూసైడ్ నోట్ లో హర్యానా పోలీసు శాఖలోని తొమ్మిది మంది సర్వింగ్ ఐపీఎస్ అధికారులు ఒక రిటైర్డ్ ఐపీఎస్, ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిల పేర్లు పేర్కొన్నారు. అదేవిధంగా వారి నుండి తాను ఎదురుకున్న కుల ఆధారిత వివక్ష, మానసిక వేధనలు, అధికారి దాడులు వంటి అంశాలను పేర్కొన్నారు.

పూరణ్ కుమార్ మరణం తర్వాత ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అమ్నీత్ పి. కుమార్ హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శత్రుజిత్ సింగ్ కపూర్, ఎస్పి రోహటక్ నరేంద్ర బిజార్నియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భం పోలీసులను ఆమె అభ్యర్థించారు. అమ్నీత్ ఫిర్యాదు ప్రకారం అధికారిక కథనాలు ఆత్మహత్య అని చెబుతున్నా తన భర్తను ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అవమానించేవారని అంతేకాక సంబంధంలేని కేసులలో ఇరికించి తనకు డిపార్ట్మెంట్ లో అసమర్థుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేసేవారని ఆమె ఆరోపించింది. అదేవిదంగా సీటీవీ, ఫోరెన్సిక్ సీబ్‌యూ, ఫోన్ కాల్స్ వంటి అంశాలను ఆధారంగా, తక్షణం కేసు నమోదు చేసిన నిందితులను అరెస్ట్ చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.

అయితే సీనియర్ పోలీస్ వర్గాలు ఈ ఆరోపణలను ఖండించారు. ఈ ఆరోపణలకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. చండీగఢ్ పోలీస్ కూడా పూరణ్ కుమార్ రాసిన “ఫైనల్ నోట్” ఆధారంగానే కేసు నమోదుచేసి దర్యాప్తు కోన సాగిస్తున్నట్లు తెలిపారు. పూరణ్ కుమార్ 2001 ఐపీఎస్ బ్యాచ్ నుండి అధికార పట్టా పొందిన ఓ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి.

అనుమానితులు ఉన్నత పదవులలో ఉన్నందున వల్ల దర్యాప్తు ప్రభావితమవ్వొచ్చు. అందువల్ల తక్షణ అరెస్ట్‌లు, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలి అని అమ్నీత్ కోరారు. భారతీయ న్యాయ సంహితా సెక్షన్ 108 (మునుపటి ఐపీసీ సెక్షన్ 306 – ఆత్మహత్యకు ప్రేరణ) కింద కేసు నమోదు చేయాలని సూచించారు.

ఈ ఘటన, మరణించిన వ్యక్తి ఓ ఐపీఎస్ అధికారి అనుమానితుల ఉన్నత పదవుల కారణంగా దేశవ్యాప్తంగా ప్రధాన వార్తగా మారింది.ఇక సిమ్లా జిల్లా రోహ్రులో, మరో దళిత బాలుడు కుల ఆధారిత వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కమ్యూనిస్టు పార్టీ నాయకులు, స్థానికులు, దళిత హక్కుల సంస్థలు నిరసనలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కుల వివక్షకు ఐపీఎస్ అధికారి బలి - Tholi Paluku