
కురుపాం గురుకుల మృతులకు నష్ట పరిహారం చెల్లించాలి
కురుపాం గురుకుల పాఠశాల లో మరణించిన ఇద్దరు బాలికలకు నష్ట పరిహారం చెల్లించి, బాలికల మరణాలు , వ్యాధి వ్యాప్తి పై సిట్టింగ్ న్యాయ మూర్తిచే విచారణ జరిపి బాధ్యులు పై చర్యలు తీసుకోవాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాల లో పచ్చ కామెర్లు వ్యాధితో పదవ తరగతి విద్యార్థినులు అంజలి, కల్పన మరణించడం , ఒక టీచరు తో సహా 140 మందికి విద్యార్థినులు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన సంఘటన పై చలించిన విదసo ఐక్య వేదిక ప్రతినిధులు గురువారం కురుపాం గురుకుల పాఠశాల ను సందర్శించిoది..
పాఠశాల లో చోటుచేసున్న మరణాలు, వ్యాధుల పై బాలికలు, వారి తల్లిదండ్రుల నుండి కీలక సమాచారం సేకరించి జరిగిన ఉపద్రవానికి ఉపశమన , పరిష్కార డిమాండ్ల తో కూడిన నివేదికను కురుపాం పర్యటన లో ఉన్న కలెక్టరుకు అందజేశారు..
ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ పాఠశాలలో నీటి కాలుష్యం , ఆపరిశుభ్ర , కారణంగా సెప్టెంబర్ 25, అకోబర్ 1 తేదీల్లో వ్యాధి సోకి అంజలి, కల్పన అను ఇద్దరు బాలికలు చనిపోతే నేటికి వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో వసతులు సరిగా లేకే వ్యాదుల తీవ్ర స్థాయిలో వ్యాపించాయని 600 మందికి ఒకే డైనింగ్ హాలు, చిన్న చిన్న హాలుల్లో క్లాసు రూమ్, క్లాసు రూమ్ లోనే పడక వంటి దుర్భర పరిస్థితుల్లో పిల్లలు చదువులు నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మొత్తం పిల్లల్లో మూడోవంతు మంది ఒకేసారి సిక్ అవడం అధికారుల నిర్లక్ష్యమే కారణమని దీనికి ఏ ఎన్ ఎమ్ వంటి అమాయక కింది స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి అసలు దోషులను ఉన్నతాది కారులు కాపాడుతున్నారని దుయ్యబట్టారు . ఐ టి డి ఏ, జిల్లా వైద్య అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ ఘటనకు బాధ్యత వహించాలని , వారిపై సిట్టింగ్ న్యాయ మూర్తిచే విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టరు ను కోరామన్నారు...
ఈ కార్యక్రమంలో జాజి ఓంకార్, బూల భాస్కర రావు, పి నాగ భూషణం, పార్వతీపురం జిల్లా విదసం ఇంచార్జి బొమ్మాళి సుందర్ రావు పాల్గొన్నారు.
