Let's talk: editor@tmv.in
కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ. కోటి సాయం.. చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ. కోటి సాయం.. చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
7 ఫిబ్రవరి, 2026

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా బర్దిపూర్‌లో జరిగిన ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి సీఎం కోటి రూపాయల చెక్కును ఆమె తల్లికి అందించారు. అలాగే, గతేడాది దుండగుల కత్తిపోటుకు గురై వీరమరణం పొందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీతకు రూ. 1 కోటి ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ సేవలో త్యాగాలు చేసిన వారి కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ. కోటి సాయం.. చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku