Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన విమర్శలు

Gaddamidi Naveen
18 అక్టోబర్, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న విజయోత్సవాలపై ప్రశ్నలు గుప్పించారు. “కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టితే ఆగం చేశారు” అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలలో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని ఆయ‌న‌ ఆరోపించాయి.

రైతు సంక్షేమంపై ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, రెండు సీజన్లకు రైతు భరోసా అందించలేదని, కౌలు రైతులు, రైతు కూలీలు ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు పొందలేదని విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న హామీ కూడా సన్నపంటలకు మాత్రమే పరిమితమైందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

రైతులకు బోనస్ బకాయిల రూపంలో రూ.1300 కోట్లకు పైగా ఇంకా చెల్లించాల్సి ఉందని, రైతు ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. లగచర్ల, రాజోలి ప్రాంతాల్లో రైతులపై పోలీసులు బేడీలు వేసిన ఘటనలను ఉదాహరణగా చూపించారు. యువతను కూడా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అది అమలు కాలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం యువతలో ఆగ్రహాన్ని రేపిందని పేర్కొందన్నారు.

మహిళల సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయని. “మహాలక్ష్మి” పథకం కింద నెలకు 2500 ఇవ్వాలని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని, ఆడబిడ్డలకు “తులం బంగారం” పథకం, వృద్ధులకు పెన్షన్ పెంపు అంశాలు వాయిదా పడ్డాయని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి రంగాల్లో కూడా ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హ‌రీష్ వ్యాఖ్యానించారు. “హైడ్రా” పేరిట పేదల ఇళ్లను కూల్చి, “మూసీ సుందరీకరణ” పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని తెలిపారు.

మొత్తంగా, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి, రైతులు, యువత, పేదలను మోసం చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

దండుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ కేబినెట్

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర కేబినెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ప్రజా సేవను పక్కనబెట్టి కమీషన్లు, కాంట్రాక్టులు, అక్రమ వసూళ్ల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు తన ఎక్స్‌ ( ట్విట్టర్‌) ఖాతా ద్వారా చేసిన వ్యాఖ్యలో, “రాష్ట్ర కేబినెట్‌ దండుపాళ్యం ముఠాను మించిపోయింది” అని పేర్కొన్నారు. మంత్రులు గ్రూపులుగా విడిపోయి కబ్జాలు, కాంట్రాక్టులు, వాటాల కోసం తన్నుకుంటున్న పరిస్థితి రాష్ట్ర పరిపాలనను దారుణ స్థితికి నెడుతోందని అన్నారు.

గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కూడా పలు మంత్రులు ప్రాజెక్టులు, టెండర్ల కేటాయింపుల విషయంలో పరస్పరం వాగ్వాదాలకు దిగారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. “ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేబినెట్‌ సమావేశాలు జరగాలి గానీ, ఎవరు ఎక్కడి నుంచి ఎంత దోచుకోవాలో అనే చర్చలకు మారిపోవడం కాంగ్రెస్‌ పాలనలోని అసలు స్వరూపం” అని ఆయన విమర్శించారు. అందినకాడికి దోచుకునేందుకు తెగబడుతున్న మంత్రులు ఇది తెలంగాణ ప్రజలకు అత్యంత దురదృష్టకరం. ప్రజల నమ్మకాన్ని వంచించిన ఈ ప్రభుత్వం రోజురోజుకీ అవినీతి బాటలో పడిపోతోందని హరీశ్ రావు అన్నారు. హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన విమర్శలు - Tholi Paluku