Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై ఎన్. రామ‌చందర్ రావు కౌంట‌ర్

కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై ఎన్. రామ‌చందర్ రావు కౌంట‌ర్

Gaddamidi Naveen
16 మార్చి, 2026

రామమందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సెక్యులరిజం పేరుతో కాంగ్రెస్ పార్టీ "ఓటు బ్యాంకు రాజకీయాలు" చేస్తోందని ఆయన విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకుంటున్నారని ఆరోపించారు.

రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీ కేవలం దేశ ప్రధానమంత్రి హోదాలోనే హాజరయ్యారని, అక్కడ ఆయన ఎలాంటి మతపరమైన పూజా కార్యక్రమాలు నిర్వహించలేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీకి సెక్యులరిజం అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే పదం మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే, రామచందర్ రావు కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీపై వ్యక్తిగత ద్వేషం కలిగి ఉన్నారని, వారి విమర్శలు రాజకీయ సరిహద్దులు దాటివేశాయని కూడా ఆరోపించారు. ప్రధాని మోదీని శత్రువుగా చూస్తూ, ఆ ద్వేషంతో వారు దేశ వ్యతిరేకులుగా మారుతున్నారు అని ఆయన చెప్పారు.

మణిశంకర్ అయ్యర్ ఏమన్నారంటే?

ఇటీవల జైపూర్‌లోని కనోడియా కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి రామ్ మందిర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సెక్యులరిజానికి వ్యతిరేకమని చెప్పిన వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చింది. శంకరాచార్యులను పక్కన పెట్టి ప్రధానమంత్రే స్వయంగా ఆలయాన్ని ప్రారంభించడం సెక్యులరిజమా? భారత ప్రధానికి ఎలాంటి మతం ఉండకూడదు అని అయ్యర్ వ్యాఖ్యానించారు.

ప్రధాని మతపరమైన తటస్థతను పాటించాలని అయ్యర్ చేసిన వాదనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించడమని, కాంగ్రెస్ మాత్రం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడమే సెక్యులరిజం అని భావిస్తోందని రాంచందర్ రావు తిప్పికొట్టారు.

కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై ఎన్. రామ‌చందర్ రావు కౌంట‌ర్ - Tholi Paluku