
కష్టాల నుండి హాకీ ఇండియా లీగ్ స్టార్‌గా ఎదిగిన వివేక్ లక్రా
ఇ టీవలే 18 ఏళ్ల వయసు నిండిన యువ గోల్‌కీపర్ వివేక్ లక్రా రాబోయే హాకీ ఇండియా లీగ్‌లో శ్రచి బెంగాల్ వారియర్స్ తరపున రూ. 23 లక్షలకు ఎంపికయ్యాడు. ఇది అతన్ని జూనియర్ ఆటగాళ్లలో అత్యధిక ధరకు కొనబడిన క్రీడాకారుడుగా మార్చింది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, కష్టపడి శ్రమించి, తన కలలను నిజం చేసుకున్న అతని కథ యువతకు స్ఫూర్తి ఇస్తోంది.
ఒడిశా రాష్ట్రంలోని సుందర్‌గఢ్, హాకీకి ప్రసిద్ధ ప్రాంతంలో పుట్టిన అతను, ప్రారంభంలో క్రికెట్, ఫుట్‌బాల్ ఇష్టపడే పిల్లవాడు. హాకీ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ అతని తండ్రి హాకీ అభిమాని చిన్నతనంలోనే ఆయనను ఆటకు పరిచయం చేశారు. ప్రాథమిక శిక్షణ కోసం ఒక కోచ్ దగ్గర పంపించారు. అయినప్పటికీ తన ప్రతిభను పెంపొందించడంలో ఎక్కువ భాగం స్వయంగా నేర్చుకున్నాడు. ప్రారంభంలో గోల్‌కీపర్ కిట్‌లు లేకపోవడం వల్ల స్ట్రైకర్‌గా ఆడినప్పటికీ, సీనియర్‌ల నుండి పాత కిట్‌లను తీసుకొని, వాటిని మరమ్మతు చేసి శిక్షణ కొనసాగించాడు.
తన మొదట దశలో ఆర్థిక ఇబ్బందులవల్ల అతను బంధువుల ఇంట్లో ఉండి శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది. రౌర్కెలాలోని స్పోర్ట్స్ హాస్టల్ లో చేరినప్పటికీ, గోల్‌కీపర్ కిట్‌లు లేమి కారణంగా కొన్ని నెలలు స్ట్రైకర్‌గా ఆడాడు. తర్వాత సరైన కిట్ లభించిన తరువాత, అతను తన ఇష్టమైన గోల్‌కీపర్ స్థానం వైపు దృష్టి పెట్టాడు. తరువాత మలేషియాలో ఎక్స్‌పోజర్ టూర్, ఖేలో ఇండియా టోర్నమెంట్ (మొదట రన్నర్స్-అప్, తర్వాత ఛాంపియన్లు),జర్మనీలో నాలుగు దేశాల టోర్నమెంట్ వంటి అవకాశాలను పొందాడు.
ప్రసిద్ధ భారత గోల్‌కీపర్ పి.ఆర్. శ్రీజేశ్ అతని ప్రేరణ. 2018లో భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో శ్రీజేశ్ ఆటను చూసి, గోల్‌కీపర్‌గా మారాలనే సంకల్పం అతనిలో ఏర్పడింది. హెచ్ఐఎల్ లో తన మొదటి సీజన్ కోసం,వివేక్ భారతీయ,విదేశీ అనుభవజ్ఞులైన గోల్‌కీపర్ల నుండి పాఠాలు నేర్చుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. ఆట సమయంలో తన శిక్షణను సరిగ్గా అమలు చేయడమే అతని ప్రధాన లక్ష్యం.
పురుషుల హాకీ ఇండియా లీగ్ చెన్నైలో ప్రారంభం కానుంది. జనవరి 3న తమిళనాడు డ్రాగన్స్, హైదరాబాద్ టూఫాన్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. జనవరి 4న శ్రచి బెంగాల్ టైగర్స్, టైటిల్ హోల్డర్స్, సూర్మా హాకీ క్లబ్‌తో ఆడనున్నారు.
వివేక్ లక్రా కథ కష్టపడి సాధించిన ఈ ప్రతిభ, కుటుంబం ప్రోత్సాహం,సీనియర్స్ సలహాల ద్వారా, హాకీ లో భారత యువ క్రీడాకారుడిగా ఎదిగి స్స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
