Let's talk: editor@tmv.in
కృష్ణా నదిలో పెరిగిన వరద ఉధృతి - శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

కృష్ణా నదిలో పెరిగిన వరద ఉధృతి - శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Praveen Batti
21 సెప్టెంబర్, 2025

జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా శ్రీశైలం జలాశయం నిండిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,85,355 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తివేసి, 3,17,922 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ వరద నీటిని వివిధ మార్గాల ద్వారా కూడా వినియోగిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,575 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 884.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ఇప్పుడు 211.47 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే, త్వరలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకునే అవకాశం ఉంది.

కృష్ణా నదిలో పెరిగిన వరద ఉధృతి - శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత - Tholi Paluku