Let's talk: editor@tmv.in
క‌ల్తీ మ‌ద్యం ఆదాయం బాబు జేబులోకి !

క‌ల్తీ మ‌ద్యం ఆదాయం బాబు జేబులోకి !

FL - TRND
16 అక్టోబర్, 2025

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ కీల‌క వ్యాఖ్యాలు చేశారు. కల్తీ మ‌ద్యం కేసులో ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు బోడిగుండు, మోకాలికి ముడి వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. జోగి రమేష్ బ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని, ఎందుకంటే బోడిగుండుకు..మోకాలికి ముడిప‌డ‌ద‌ని గోరంట్ల మాధ‌వ్ స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న అనంత‌పురం వైసీపీ కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ప్ర‌తి ఊరికి నాలుగు బెల్టు షాపులు, సందుకో బ్రాంది షాపు ఏర్పాటు చేసి.. ఆ బ్రాందీ షాపులు, బెల్టు షాపుల్లోకి చంద్ర‌బాబు త‌యారు చేసిన క‌ల్తీ మ‌ద్యం వెళ్తోంద‌ని ఆరోపించారు. దాని ద్వారా వ‌చ్చే ఆదాయం చంద్ర‌బాబు జేబులోకి వెళ్తోంద‌ని, దీనిని ప్ర‌జ‌లు గుర్తించాల‌ని కోరారు.

పోలీసులు ఒక వ్య‌క్తిని అరెస్టు చేసిన‌ప్పుడు ఆ వ్య‌క్తి వ‌ద్ద ఏలాంటి వ‌స్తువులు ఉన్నా వాటిని తీసుకుని రికార్డు చేస్తామ‌ని, ఆ వ్య‌క్తి క‌ద‌లిక‌లు పూర్తీగా నిషేధిస్తార‌ని తెలిపారు. కానీ పోలీసులు అరెస్టు చేసిన వ్య‌క్తి తెలుగుదేశం ప్ర‌భుత్వానికి అనుకూలంగా, వైసీపీ నేత జోగి ర‌మేష్ ను ఇరికించే విధంగా వీడియో విడుద‌ల కావ‌డం దారుణ‌మ‌ని అన్నారు. ఇంత‌కంటే దౌర్భాగ్యం ఇంకోటి లేద‌ని అన్నారు. ఇప్ప‌టికే ఐపీఎస్ అధికారులు జైళ్ల‌కు వెళ్లారని, చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్న విష‌యాన్ని పోలీసులు గుర్తించి, తెలుగుదేశం పార్టీ ఏవిధంగా పోలీసుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తోందో తెలుసుకోవాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైతే ఈ వీడియో రిలీజ్ చేసిన పోలీసుల‌పై కూడా కేసులు పెడ‌తార‌ని విమ‌ర్శించారు.

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఏపీ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని,ఆర్థిక ప‌రిస్థితిని కాపాడాల్సిన బాధ్య‌త ఉంద‌ని గోరంట్ల మాధ‌వ్ అన్నారు. బీజేపీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాన్ని మోదీ దృష్టికి తీసుకువెళ్లాల‌ని కోరారు. రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ నిర్వీర్యం అయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఏ పార్టీకి, ఏప్రాంతానికి మంచిది కాద‌ని అన్నారు. పోలీసు వ్య‌వ‌స్థ మేల్కొని చ‌ట్టప‌రంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. క‌ల్తీ మ‌ద్యం కేసులో వైసీపీ నేత‌ల్ని ఇరికించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. దేవుడి మీద ప్ర‌మాణం చేసి కూడా అద్భుతంగా అబ‌ద్దాలు చెప్ప‌గ‌ల నేర్పు చంద్ర‌బాబుద‌ని, లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కు కూడా దొర‌క‌డని గోరంట్ల మాధ‌వ్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క‌రువ‌య్యాయ‌ని, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మిథున్ రెడ్డి ఇంటిపై సోదాలు నిర్వ‌హించిన సిట్ అధికారులు..కొండ‌ను త‌వ్వి ఎలుక ప‌ట్టిన‌ట్టుగా వ్య‌వ‌హారం ఉంద‌ని అన్నారు.

క‌ల్తీ మ‌ద్యం ఆదాయం బాబు జేబులోకి ! - Tholi Paluku