
కరోనా కాటేస్తోంది!
మరణపు మబ్బులా నింబస్ వేరియంట్ అమెరికాతో పాటు యూకేను కూడా కమ్మేస్తోంది. రేజర్ బ్లేడ్ అని పేరు తెచ్చుకున్న ఈ కొత్త కరోనా రూపం భయానకంగా పాకుతోంది. ఒకసారి తగిలితే గొంతు లోపల కత్తులతో చీల్చినట్టుగా మండిపోతుంది, మింగడానికి ప్రయత్నిస్తే రక్తం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టుగా ఘోరమైన నొప్పి కలుగుతోంది. ఇది జలుబు కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. ఎందుకంటే పరీక్షలో అసలు నిజం బయటపడుతోంది. ఇది నింబస్.. అంటే రేజర్ బ్లేడ్ కరోనా! ప్రతి రోజు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి, మూడు నెలల్లో వచ్చే కేసులు ఇప్పుడు ఒక్క నెలలోనే చేరిపోతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు, ప్రతి దగ్గు మరణ శంఖారావంలా వినిపిస్తోంది, ప్రతి గొంతు నొప్పి.. కత్తిపోటులా అనిపిస్తోంది.
ఈ వేరియంట్ చాలా కపటమైనది. టీకాలు వేసుకున్నా ఉపయోగపడడంలేదు. ఎందుకంటే నింబస్ తన రూపాన్ని మార్చుకుని శరీరంలోకి చొరబడుతోంది. జ్వరం, దగ్గు, శరీర నొప్పులు, అలసట, వాంతులు, ఛాతి బిగుసుకుపోవడం ఒక్కొక్కరినీ పూర్తిగా కిందపడేస్తున్నాయి. ఈ నింబస్ వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబంలో పుట్టిన కొత్త రాక్షసుడు. పాత స్ట్రెయిన్‌లను మించి ఇది మరింత వేగంగా వ్యాపిస్తోంది. దాగుడుమూతల ఆట ఆడుతున్నట్టుగా ఇది శరీర రక్షణ వ్యవస్థను మోసం చేస్తోంది. రక్తంలో ఉన్న యాంటీబాడీలు దీన్ని గుర్తించలేవు, ఎందుకంటే ఇది తన ముఖాన్ని ప్రతి క్షణం మార్చుకుంటోంది. అందుకే ఒక్కోసారి జలుబు లాగా మొదలై ఒక్క రోజులోనే తుఫానుగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పర్యవేక్షణలో ఉన్న వేరియంట్‌గా ప్రకటించింది. ఎందుకంటే ఇది ఇప్పటికే పలు దేశాల్లో పాకి వందలాదిగా కేసులను పెంచుతోంది.
ఈ నింబస్ వేరియంట్ సాధారణంగా యువకుల కంటే వృద్ధుల మీద మరింత ఘోరంగా దాడి చేస్తోంది. 60ఏళ్లు దాటిన వారిలో ఇది శరీరాన్ని క్రమంగా బలహీనపరుస్తూ ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, మధుమేహం బాధపడుతున్నవారు, కిడ్నీ లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో జీవిస్తున్నవారు దీని దెబ్బకు తొందరగా కూలిపోతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోయినవారు అయితే చిన్న దగ్గు నుంచి పెద్ద ప్రమాదం వరకు ఒక క్షణంలోనే దూసుకెళ్తోంది. చిన్నపిల్లల్లో కూడా ఇది అసాధారణంగా వేగంగా పాకుతోంది, ఒక్కసారిగా జ్వరం ఎగిసి పడుతోంది. ఈ వేరియంట్ ఒకసారి శరీరంలోకి చొరబడితే దానిని కట్టడి చేయడం చాలా కష్టమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీని పేరు వింటుంటే ప్రజల గుండెల్లో వణుకు పుడుతోంది.
ఇటు శీతాకాలం దగ్గర పడుతుండగా, చాలా మంది జలుబు లాంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ముక్కు కారటం, దగ్గు, తేలికపాటి జ్వరం వస్తోంది. చాలా సందర్భాలలో ఇది కరోనాతో ముడిపడి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఇన్ఫెక్షన్ రేట్లు భారీ స్థాయికి పెరిగాయి. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఈ నింబస్ వేరియంట్‌ను 2025 జనవరిలో మొదటిసారిగా గుర్తించారు. ఇక మరో భయంకరమైన విషయం కూడా ఉంది. కొత్త అధ్యయనాలు ప్రకారం.. కరోనా ప్రభావం శరీరాన్ని వదిలినా, కొన్ని లక్షణాలు జీవితాంతం వెంటాడుతాయట. అందులో ముఖ్యమైనది వాసన కోల్పోవడం. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. కరోనా సోకిన రెండు సంవత్సరాల తర్వాత కూడా 80శాతం మంది రోగులు వాసన గుర్తించడం లేదు. ఆ సామర్థ్యం పూర్తిగా తిరిగి రాలేదు. కొంతమంది శాశ్వతంగా ఆ గుణం కోల్పోయారు. ఇది జీవన నాణ్యతను కుంగదీసే మానసిక వ్యాధిలా మారుతుంది. వాసన గుర్తించలేకపోవడం అంటే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోలేకపోవడం. గ్యాస్ లీక్ అయినా, పొగ వచ్చినా, పాడైన ఆహారమున్నా మనకు తెలియదు.
ఇలాంటి అధ్యయనాల మధ్య నింబస్ వేరియంట్ విజృంభిస్తుండడం మరింత ఆందోళన కలిగించే విషయం. మరోవైపు స్ట్రాటస్ అనే కొత్త వేరియంట్ గురించి కూడా చర్చ జరుగుతోంది. అంటే పేర్లు మాత్రమే మారుతున్నాయి.. కానీ ముప్పు మాత్రం పాతదే. వైరస్ నిద్రపోవడం లేదు. అది రూపం మార్చుకుంటోంది. అందుకే ఈ యుద్ధం ఇంకా పూర్తికాలేదు. కరోనా కేవలం వ్యాధి కాదు, ఇది మానవ జాతి సహనాన్ని పరీక్షించే శతాబ్దపు సవాలు. సో బీ కేర్‌ఫుల్ అండి..!
