Let's talk: editor@tmv.in
కరీంనగర్‌లో కమలం గూటికి ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు

కరీంనగర్‌లో కమలం గూటికి ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు

Gaddamidi Naveen
15 ఫిబ్రవరి, 2026

కరీంనగర్ నగర పాలక సంస్థలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నూతనంగా ఎన్నికైన ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజేపీలో చేరారు అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.

తాజాగా ఎన్నికైన 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, అలాగే 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్ అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కరీంనగర్ సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ చేరికలతో కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ బలం మరింత పెరిగింది.