
కుంభమేళాకు కోట్లు.. మేడారానికి పైసలేవి?
నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను గతంలో మేడారం నుంచే పాదయాత్ర ప్రారంభించానని గుర్తు చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల భవనాలే కాదు ఆదివాసీల జీవితాలు కూడా మారాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఆనాటి పాలకులు సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని ఆరోపించారు. అమ్మవార్ల ఆశీస్సులతో నాడు ఇక్కడి నుంచే తాను పాదయాత్ర మొదలుపెట్టానని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని కామెంట్ చేశారు. ఇటీవలే ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
జన్మధన్యమైందన్న ముఖ్యమంత్రి
సమ్మక్క-సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కతో పాటు తన జన్మ ధన్యమైనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయని.. అందుకే సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామని క్లారిటీ ఇచ్చారు. మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామని అన్నారు. పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే అనుకున్న కార్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. మహా జాతరకు తాను మళ్లీ వస్తానని.. ఈసారి మేడారం జాతరను కన్నుల పండుగగా జరుపుకుందామని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కుంభమేళాకు రూ.వేల కోట్లు ఇస్తున్న కేంద్రం.. ఆదివాసీ కుంభమేళాగా భావించే మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపును ఇచ్చి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్‌పై ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణల ప్రకారం, గత పాలకులు (ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం) మేడారం జాతరపై వివక్ష చూపారని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పాలనలో 2022లో జరిగిన మేడారం జాతరకు రూ.75 కోట్లు మంజూరు చేశామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అంతకుముందు సంవత్సరాల్లో కూడా రూ.80 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రోడ్లు, నీటి సరఫరా, పోలీసు వ్యవస్థలు వంటి మౌలిక సదుపాయాలపై ఖర్చు చేశారు. అయినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసి, రూ.236 కోట్ల మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇది గత ప్రభుత్వాల కంటే ఎక్కువే. బీఆర్ఎస్ పాలనలో కేటాయింపులు జరిగినా అభివృద్ధి పెద్దగా ఏమీ కనిపించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందా?
సీఎం రేవంత్ రెడ్డి కుంభమేళా ,మేడారం జాతర నిధులపై పోలిక చేస్తూ కేంద్రాన్ని విమర్శించారు. వాస్తవానికి, 2025 మహా కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం రూ.2,100 కోట్ల ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేసింది. మొత్తం బడ్జెట్ రూ.7,500 కోట్లకు చేరుకుంది. దీనికి విరుద్ధంగా, మేడారం జాతరకు కేంద్రం నుంచి చాలా తక్కువ నిధులు వచ్చాయి.
2024లో రూ.3 కోట్లు (పర్యాటకం, గిరిజన సంక్షేమ శాఖల నుంచి) మంజూరు చేశారు. 2018, 2020ల్లో రూ.2 కోట్లు, 2024లో రూ.2.3 కోట్లు ఇచ్చారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన మేళాగా పేరొందిన మేడారం జాతరకు ఇంత తక్కువ నిధులు కేటాయించడం వివక్షగానే కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం గతంలోనూ ఆరోపించారు. రాజకీయంగా ఉత్తరాది మేళాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపిస్తోంది, అయితే మేడారం జాతరకు జాతీయ పండగగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేయడం. జాతరకు నిధులు మంజూరు చేయాలని కోరడం న్యాయంగానే కనిపిస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందా? నిధులను కేటాయిస్తుందా? అన్నది వేచి చూడాలి.
