
కప్పు కోసం ఆగని తెలుగు టైటాన్స్ నీరీక్షణ..
2014లో మొదలు అయిన ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు ఎన్నో టీమ్‌లు ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. జైపూర్ పింక్‌పాంథర్స్, దబాంగ్ ఢిల్లీ, యు ముంబా, హర్యానా స్టీలర్స్, పూణేరి పల్టన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, ఇక పాట్నా పైరేట్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అంటే పాట్నా గెలిచినన్ని కప్పులు మరే టీమ్ సాధించలేదు.
అయితే ఐపిఎల్‌లో చోకర్స్ అంటే గుర్తొచ్చే పేరు ఆర్‌సిబి, అలాగే ఇప్పుడు కబడ్డీలో చోకింగ్ అంటే గుర్తు వచ్చే పేరు తెలుగు టైటాన్స్. జరిగిన 11 సీజన్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే క్వాలిఫైయర్స్‌కి చేరుకుంది. ఇప్పుడు 12వ సీజన్‌లో అనూహ్యమైన ఆట తీరును చూపించి టేబల్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది. టైటాన్స్ ఫ్యాన్స్ అంతా కూడా ఈసారి ఎలాగయిన కప్పు సాధితరు అనే ఆశతో ఉన్న సమయంలో, తెలుగు టైటాన్స్ టీమ్ నిన్న రాత్రి జరిగిన సెమీ ఫైనల్స్‌లో పూణేరి పల్టాన్స్ చేతిలో చిత్తుగా ఓడి ఇంటి ముఖం పట్టింది. దీనితో కోచ్ కిషన్ హోడా తీవ్ర నిరాశకి గురి అయ్యారు. జీరో టు హీరో అనే స్థాయికి ఆయన టీమ్‌ని పుంజుకొచ్చారు. కానీ ఎప్పటిలానే చోకర్స్‌గా టీమ్ పర్ఫార్మన్స్‌ని మిగిల్చింది.
క్వాలిఫై అయిన టాప్ ఎనిమిది టీమ్‌లలో, ట్రోఫీ గెలవని ఏకైక టీమ్‌గా తెలుగు టైటాన్స్ నిలిచింది. కానీ ట్రోఫీ గెలిచిన టీమ్‌లకి సరి సమానంగా పోటీని అందించి, కప్పు పై ఆశాలని పెంచింది. ఆట మొదలు అయిన అయిదు నిమిషాలలో పూణే ఒక పాయింటు, తెలుగు టైటాన్స్ పది పాయింట్లు సాదించి, భారీ లీడ్‌ను సొంతం చేసుకుంది. ఎప్పటిలానే భరత్ హోడా తన ఫ్రీ హ్యాండ్ గేమ్‌తో ఆపోనెంట్‌లని వణుకు పుట్టించాడు, విజయ్ మాలిక్ అద్బుతమైన కెప్టెన్సీని ప్రదర్శించాడు, డిఫెండర్‌లు కూడా వచ్చిన రైడర్లని వచ్చినట్టుగా అవుట్ చేసి పాయింట్లు సాధించారు. ఇక గెలుపు మనదే అనుకున్న సమయంలో, పూణే నుంచి ఆదిత్య షిండేను సబ్స్టిట్యూట్‌గా తీసుకున్నారు కోచ్ అజయ్ ఠాకూర్.
తన రైడింగ్ నైపుణ్యంతో గేమ్‌ని వన్ సైడ్‌గా మార్చేశాడు. భరత్, విజయ్ రైడింగ్ పరంగా వారి సర్వ శక్తులా ప్రయత్నించినా.. దేఫెన్డర్‌ల ఓవర్ కాన్ఫిడెన్స్ మ్యాచ్ మొత్తాన్ని దెబ్బ తీసింది, సాగర్ రావల్ ప్రీ డిఫెన్సు, అంకిత్ కేర్ లెస్ లెఫ్ట్ లైన్ డిఫెన్సు ఆదిత్యకి చాలా ఈజీ లూప్ హోల్స్‌గా కన్వర్ట్ అయ్యాయి. దీనితో పాటు అజిత్ పవర్ అతి తొందర పాటు వలన ఎనిమిది ఫైయిల్డ్ టాకీల్ పాయింట్లు కొలిపోయింది టైటాన్స్. మ్యాచ్ పూర్తయ్యేసరికి 50-44తో పూణే అయిదు పాయింట్ల ఆధిక్యంతో ఫైనల్స్‌కి చేరుకుంది. కేవలం రైడ్‌లతో 22 పాయింట్లను సాధించి ఆదిత్య షిండే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మరోసారి టైటాన్స్ అభిమానులు కప్పు కోసం ఎదురు చూపూలు తప్పవు. ఇక రేపు శుక్రవారం జరిగనున్న ఫైనల్స్‌లో పూణే మరోసారి ఢిల్లీతో తలపడనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీతో మూడు సార్లు ఓడిపోయింది పూణే. మరి ఫైనల్స్‌లో పూణే ఆదిత్య షిండేని వాడుకొని ఏమైనా మ్యాజిక్ చేయనుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
