
కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి
తన కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగ మరి కన్నా కొడుకు ప్రాణాలు పలికొన్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యతను పక్కన పెట్టి, తండ్రి తన రెండున్నరేళ్ల కుమారుణ్ని క్రూరంగా చంపి మూసీ నదిలో పడేసిన ఘోర ఘటన బండ్లగూడ పాతబస్తీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, చిన్నారి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నీలాఫర్లోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. తండ్రి బండ్లగూడ పరిసర ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. కాగా కుమారుడికి అనారోగ్య సమస్యలు ఉన్నందున ఈ నెల 12న మరలా కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అదే రోజు తెల్లవారుజామున తండ్రి ఘోరమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలుడి గొంతునులిమి చంపి, నయాపూల్ బ్రిడ్జి సమీపంలోని మూసీలో విసిరేసి ఏమి తెలియనట్టు అక్కడినుండి వెళ్ళిపోయాడు.
మరోవైపు తన కుమారుడు కనిపించడంలేదని గమనించిన బాలుడి తల్లి తమ బంధువులతో కలిసి వెతికిన ఫలితం లేకుండపోయింది. ఈవిషయమై బాలుడి తండ్రిని గట్టిగ నిలదీయడంతో అసలు నిజం బయటపడింది. చిన్నారి తరుపు బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇక చిన్నారిని గుర్తించడానికి హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలంలో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
