Let's talk: editor@tmv.in
కొండా సురేఖ వర్సెస్ నాయిని

కొండా సురేఖ వర్సెస్ నాయిని

Gaddamidi Naveen
15 సెప్టెంబర్, 2025

వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. అదృష్టం కొద్దీ నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పై ఆయన మండిపడ్డారు. కొండా సురేఖలా పూటకో పార్టీ మారితే నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని సెటైర్లు వేశారు. అంతకు ముందు నాయిని రాజేందర్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. నాయిని ఏదో అదృష్టంతో ఎమ్మెల్యేగా గెలిచారన్నారు.

నాయిని రాజేందర్ రెడ్డి తనకంటే చిన్నోడు అని, ఏదో అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యాడని, దేవాదాయ శాఖ మంత్రి హోదాలో గుడిలో ఒకరిద్దరు ధర్మకర్తలను నియామకం చేసే అధికారం కూడా తనకు లేదా? అని కొండా సురేఖ ప్రశ్నించారు. నాయిని రాజేందర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలకమండలిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా అని నిలదీశారు. అయినా నా నియోజకవర్గంలో ఆమె పెత్తనమేంటని నిలదీశారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంబిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాయిని మరోసారి కొండా సురేఖ చర్చనీయాంశంగా మారారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం విషయంలో కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశానని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

కొండా సురేఖ వర్సెస్ నాయిని - Tholi Paluku