Let's talk: editor@tmv.in
క‌డియం శ్రీహ‌రిపై మాజీ మంత్రి కామెంట్స్

క‌డియం శ్రీహ‌రిపై మాజీ మంత్రి కామెంట్స్

Gaddamidi Naveen
23 సెప్టెంబర్, 2025

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ అనర్హత వేటు, పార్టీ ఫిరాయింపులపై వివాదాల నేపథ్యంలో ఇటీవల చేసిన వ్యాఖ్యల పై మాజీ మంత్రి ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర‌డం పై గ‌తంలో స్పీక‌ర్ నోటీసులు జ‌రిచేశార‌ని, దీనిపై క‌డియం శ్రీహ‌రి బీఆర్ఎస్ ను విమ‌ర్శించ‌డంపై జ‌గ‌దీష్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హులు అవ్వ‌డం, ఖాయం వీరి నియోజకవర్గాలలో ఎన్నిక‌లు రావ‌డం ,ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఖాయం అన్నారు.

క‌డియం పార్టీ ఫిరాయింపులపై నేను నైతికంగా వ్యతిరేకుడిని అని చెబుతున్నారు కానీ నియోజకవర్గ అభివృద్ధి సమక్షంగా, ప్రజలను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చాయన్న విషయాన్ని కూడాతెలిపారు. క‌డియం శ్రీహ‌రిఏ పార్టీలో ఉన్నానో స్పీక‌ర్ నిర్ణ‌యిస్తార‌ని, సోయి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారాని మాజీ మంత్రి జ‌గ‌దీష్ విమ‌ర్శించారు. స్పీక‌ర్ నిర్ణ‌యం ఏద్తెనా ప్ర‌జ‌ల దృష్టిలో వారు ఏమిటో అర్థం అయిందాన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌దాని తెలిపారు. సుప్రీంకోర్టు స్పీక‌ర్ కు ఇచ్చిన స‌మ‌యం కొన్ని రోజుల్లో ముగుస్తుందాని.పార్టీ మారడం వలన ఎమ్మెల్యేలకు ఆ స్థానం పైఉండే హక్కు ఉంటదా లేదా అనే అంశం దాదాపుగా స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.

క‌డియం శ్రీహ‌రిపై మాజీ మంత్రి కామెంట్స్ - Tholi Paluku