
కడప రైల్వే స్టేషన్ లో దారుణం
కడప రైల్వే స్టేషన్ లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తమ 18 నెలల చిన్నారి తో సహా ఒక జంట వేగంగా దూసుకొస్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్యకు చేసుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సేకరించి పోస్ట్‌మార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మృతులు కడపలోని శంకరాపురానికి చెందిన శ్రీరామ్ (35), శిరీష (30), వారి కుమార్తె రిత్విక గా గుర్తించారు.కాగా ఈ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
మరోవైపు కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంకాలేదని, కుటుంబం ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఆర్థిక ఒత్తిడి, వ్యక్తిగత వివాదాలు వంటి కారణాలు ఆత్మత్యాకు మూలమైయుండొచ్చు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అయన పేర్కొన్నారు
మరోవైపు ప్రత్యేక సాక్షులు స్పందిస్తూ రైలు ఢీ కొట్టిన తీవ్రత అధికంగా ఉండడంతో, మృతదేహాలు పూర్తిగా ఛిద్రమై రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిఉండడం తమను ఎంతగానో కలిచేవిందని, చిన్న పిల్లతో సహా కుటుంబం మొత్తం ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు, ఏమైనా సమస్యలుంటే కూర్చొనే పరిష్కరించువాలి అంతే తప్ప ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని ఆవేదన వ్యక్తంచేశారు
