Let's talk: editor@tmv.in
కాంగ్రెస్​ అబద్ధాలను ప్రచారం చేస్తోంది: అమిత్​ షా

కాంగ్రెస్​ అబద్ధాలను ప్రచారం చేస్తోంది: అమిత్​ షా

Pinjari Chand
19 సెప్టెంబర్, 2025

బీజేపీపై అబద్దాలను వ్యాప్తి చేసి రానున్న బీహార్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆరోపించారు. రాహుల్​ గాంధీ ఓట్ల సవరణపై చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. గురువారం బీహర్​ లోని దక్షిణ ప్రాంతాలైన డెహ్రీ, షహబాద్​, మగధ ప్రాంతాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల చోరీపై రాహుల్​ గాంధీ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, బంగ్లాదేశ్​ చొరబాటుదారులను కాపాడేందుకే కాంగ్రెస్​ పార్టీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అలాగే గతంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్​ ఆరోపించింది.కానీ అలా జరగలేదు కదా? ఏ ఒక్కరి రిజర్వేషన్లనైనా తొలగించామా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు ఓట్లచోరీ అంశాన్ని ముందు పెట్టి బీహార్​ రాజకీయాల్లో లబ్దపొందాలని చూస్తోందని విమర్శించారు. ఇక్కడ ఉన్న అక్రమ వలసదారుల ఓట్లను తొలగించడానికే ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్​ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పది జిల్లాల నేతలతో సమావేశమై కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా అక్రమ వలసదారులతో నిండిపోతుందని ప్రచారం చేయాలని బీజేపీ నాయకులకు సూచించారు. ఓట్ అధికార్​ యాత్ర ప్రధాన లక్ష్యం కూడా బంగ్లాదేశీయులకు మార్గం సుగమం చేయడానికేనని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా బీహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తో సమావేశమయ్యారు.

కాంగ్రెస్​ అబద్ధాలను ప్రచారం చేస్తోంది: అమిత్​ షా - Tholi Paluku