Let's talk: editor@tmv.in
కంగనాను చెప్పుతో కొట్టండి: కాంగ్రెస్ సీనియర్ నేత

కంగనాను చెప్పుతో కొట్టండి: కాంగ్రెస్ సీనియర్ నేత

Pinjari Chand
19 సెప్టెంబర్, 2025

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్​ కంగనా రనౌత్​ ను చెప్పుతో కొట్టాలని తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్​, సీనియర్​ నాయకుడు కేఎస్​ అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన రాజకీయ దుమారం రేగింది. ఈ సందర్భంగా ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్​ రైతుల పట్ల అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. గతంలో 2020లో జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్న 73 సంవత్సరాల మహిందర్​ కౌర్​ ను షాహిన్ బాగ్​ ఉద్యమంలో పాల్గొన్న బిల్కిస్​ బానోగా వర్ణించింది.ఆమెను కించపరుస్తూ కంగనా రనౌత్​ ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే రూ.100 వంద చెల్లిస్తే నిరసనలకు మహిళలు తరలివస్తారన్న వ్యాఖ్యలపై కేఎస్​.అళగిరిని మీడియా ప్రశ్నించింది.అందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ ఆమె దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా పర్యటిస్తే చెప్పు దెబ్బ కానీ చెంపదెబ్బ కానీ కొట్టాలని తీవ్రంగా స్పందించారు. కంగనా ఇలాంటి పొగరెక్కిన మాటలు చాలా సార్లు మాట్లాడిందని గుర్తుచేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలో

గతంలో కంగనా ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నప్పుడు అక్కడ పనిచేసే సీఐఎస్​ఎఫ్​ కి చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిందని, విచారణలో రైతుల గురించి అవమానకరంగా, అహంకరపూరితంగా మాట్లిడినందుకే అలా చేశానని స్పష్టం చేసింది. రైతు ఉద్యమ సమయంలోనూ కేంద్రంలో బీజేపీ లేకుంటే భారత్​ కూడా మరో బంగ్లాదేశ్​లా మారేదని వ్యాఖ్యనించింది. అలా జరిగి ఉంటే రైతుల శవాలు వేలాడుతుండేవని, మహిళలపై అత్యాచారాలు జరిగేవని ఎక్స్​ లో పోస్ట్​ చేసింది. దీనిపై గతంలో పెద్ద దుమారం రేగింది. ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో పార్టీకి, ఆమె చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని పార్టీ పక్కకు తప్పుకుంది.

కంగనా రనౌత్​ స్పందన

ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చని అందుకు భారత రాజ్యాంగం హక్కులు కల్పించిందని బీజేపీ ఎంపీ కంగనారనౌత్​ అన్నారు. కంగనా గురువారం కాంగ్రెస్​ నాయకుడు కేఎస్​ అళగిరి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అలాగే ఆయన మహిళలపై ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడకూడదని, ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపినట్లవుతుందన్నారు. దేశంలో ద్వేషించే వారు కొందరుంటే, ప్రేమించేవారు చాలా మంది ఉన్నారన్నారు.

కంగనాను చెప్పుతో కొట్టండి: కాంగ్రెస్ సీనియర్ నేత - Tholi Paluku