Let's talk: editor@tmv.in
కుక్కలు... బాబోయ్​

కుక్కలు... బాబోయ్​

Pinjari Chand
15 సెప్టెంబర్, 2025

అయ్యా బాబోయ్​ ఒకే రోజు దాదాపు 67 మందిని కుక్కలు కరిచాయి. దీంతో బాధితులు దవాఖానకు వరుస కట్టారు. అందరికీ వ్యాక్సిన్​లు ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్​లు ఇస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కల్యాణ్, దొంబివాలిలో జరిగాయి. అక్కడ వీధి కుక్కలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒకేరోజు వివిధ ప్రాంతాల్లో అంతమందిని కరవడంతో బయట తిరగాలంటేనే భయపడుతున్నారు. అయితే ప్రతినెల వేయికి పైగా కుక్కలకు రేబిస్​ వ్యాక్సిన్లు వేస్తున్నట్లు కేడీఎంసీ వివరించింది.

ఇంతకు ముందు కూడా కుక్క కాటు కేసులు వచ్చేవని అయితే ఒకేరోజు ఇన్ని కేసులు రావడం మొదటిసారని మున్సిపల్​ కార్పోరేషన్​ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్​ దీపా తెలిపారు. బాధితులందరికీ ఇంజక్షన్లు సకాలంలో ఇచ్చామన్నారు. అలాగే విధికుక్కలకు కూడా వ్యాక్సిన్లు ఇస్తున్నామని చెప్పారు. కుక్క కాటు వల్ల జరిగే ప్రమాదాలపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నమన్నారు. భవిష్యత్​ లో డాగ్​ సెంటర్​ ను ప్రారంభించే ప్లాన్​ ఉందన్నారు. ప్రతినెలా సుమారు 1100 కుక్కలకు స్టెరిలైజేషన్​ చేస్తున్నామన్నారు. ఈ ఘటనల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్​ దవాఖానల్లో ఫుల్ రష్​ ఏర్పడింది. బాధితులు చికిత్స కోసం ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.