Let's talk: editor@tmv.in
‘ఓజి’ గేమ్‌లో సుభాష్ చంద్రబోస్?

‘ఓజి’ గేమ్‌లో సుభాష్ చంద్రబోస్?

Koripelli Aditya
24 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, సినిమా, సెప్టెంబర్ 24:* సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘దే కాల్ హిమ్ ఓజి’ చిత్రం, పవన్ కళ్యాణ్ ‘ఓజాస్’ గంభీర పాత్రలో మెరవడంతో ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై అపార ఆసక్తి చూపుతున్నారు. టీజర్ నుంచి థమన్ సంగీతం వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ అంచనాలను పెంచేస్తోంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

విడుదల ప్రయాణం కొంచెం ట్విస్ట్‌లతో కూడినదే. మేకర్స్ సెప్టెంబర్ 21న ఉదయానికి ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించినా, టెక్నికల్ సమస్యల వల్ల దాన్ని వాయిదా వేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో జరిగిన ‘ఓజి’ కాన్సర్ట్‌ ను వాయిదా వేసినాగానీ వర్షంలో అభిమానులు, అరుపులతో కూడిన చప్పట్లతో మొదలైన ఈ ఈవెంట్ ట్రైలర్ అక్కడ కూడా కనిపించలేదు. అయినా, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్‌లతో రచ్చ చేస్తూ ఎదురు చూశారు. చివరికి, సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 2:30కి తెలుగు, హిందీ, తమిళం వంటి భాషల్లో రెండు నిమిషాల డైనమిక్ రీల్‌ను డ్రాప్ చేశారు. క్షణాల్లోనే యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌తో రికార్డులు పగలగొట్టింది.

సుజీత్ ఈ ట్రైలర్‌ను ఎక్స్‌లెంట్‌గా డిజైన్ చేశారు. ముంబైలో ఆగిపోయిన యుద్ధం మళ్లీ రక్తపు తుఫానుగా మారే షాడో ఇంట్రో, ఎమ్రాన్ హష్మీ ఓమి భౌ పాత్రలో ఆయుధాలు, అనుచరులతో కూడిన మాఫియా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని, నగరాన్ని గందరగోళంలో ముంచుతాడు. ఇటువంటి గందరగోళంలో, ఆజ్ఞయాతం నుంచి తిరిగి వచ్చిన ఓజాస్ గంభీరా ముంబై మట్టిపై అడుగుపెట్టి, తన ప్రత్యర్థిని ఎదుర్కొంటాడనేదే సినిమా సారాంశం. రెట్రో విజువల్స్, వింటేజ్ ఔట్‌ఫిట్స్‌తో పవన్ ఫ్రేమ్‌ను హైలైట్ చేస్తూ, థమన్ స్కోర్ బీట్‌ను రంజింపజేస్తుంది.

ఇది ఇలా ఉండగా సెన్సార్ వారు ఈ చిత్రానికి ‘ఏ(అడల్ట్స్)’ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. మొత్తంగా, ట్రైలర్ మంచి ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనర్‌గా ఉంది. పవన్ గ్యాంగ్‌స్టర్ మోడ్‌లో యాక్షన్ సీన్లు తీయడం, ఫ్యాన్స్‌కు థియేటర్‌లలో ఫుల్ మీల్స్ ఖాయం. సెప్టెంబర్ 25న వచ్చే ఈ చిత్రం, తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది.

ట్రైలర్, సెన్సార్ రిపోర్ట్.. ఇలా ఇవి మాత్రమే కాకుండా ఫ్యాన్ కోసం డైరెక్టర్ సుజీత్ ‘ఓజి ఫస్ట్ బ్లడ్’ అనే గేమ్‌ని కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. దర్శకుడు సుజీత్ ఈ గేమ్ గురించి చెప్తూ ‘వన్స్‌మోర్ డాట్ ఐఓ(oncemore.io) ’ అనే వెబ్‌సైట్‌లో ‘ఓజి ఫస్ట్ బ్లడ్’ అనే గేమ్ విడుదల అయ్యింది. ఎవరు అయితే మొదటి 10 లక్షల మంది ఈ గేమ్‌లో సెలెక్ట్ అవుతారో, వారికి మా టీమ్ తరుపున ఒక సర్ప్రైజ్ గిఫ్టు లభిస్తుంది’ అని తెలియజేశారు. కొందరు ఫ్యాన్స్ ఈ గేమ్‌ని ఎంజాయ్ చేస్తుంటే. మరికొందరు ఈ గేమ్ పోస్టర్‌లో ఉన్న నేతాజీ సుబాష్ చంద్రబోస్ గారిని చూసి, ఈ చిత్రంలో ఆయన గురించి ఏమైనా తెలియజేస్తారా? అనే అనుమనాలు రేకెత్తాయి. లసాలు ‘ఓజి’ పోస్టర్‌లో సుభాష్ చంద్రబోస్ ఎందుకు ఉన్నారు? ఈ చిత్రంలో ఆయన గురించి ఏమైనా చెబుతారా? లేదా ఇది మేకర్స్ వీడియో గేమ్ వరకే అంకితం చేస్తున్నారా? ఇవి అన్నీ తెలియాలి అంటే సెప్టెంబర్ 25 వరకు వేచి చూడాల్సిందే.

‘ఓజి’ గేమ్‌లో సుభాష్ చంద్రబోస్? - Tholi Paluku