Let's talk: editor@tmv.in
ఒడిశాలో మావోయిస్టు కీలక నేత సుక్రూ లొంగుబాటు

ఒడిశాలో మావోయిస్టు కీలక నేత సుక్రూ లొంగుబాటు

Pinjari Chand
26 మార్చి, 2026

ఒడిశా పోలీసులకు భారీ విజయంగా, అత్యంత మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేత సుక్రూ సహా ఐదుగురు మావోయిస్టులు బుధవారం పోలీసులకు లొంగిపోయారు. ఏడీజీ (యాంటీ-నక్సల్ ఆపరేషన్స్) సంజీవ్ పాండా తెలిపారు. లొంగిపోయిన ఈ ఐదుగురిపై మొత్తం రూ.66 లక్షల బహుమతి ఉంది. వీరు తమ వద్ద ఉన్న ఐదు ఆయుధాలను కూడా అప్పగించారు. అందులో ఒక ఏకే-47, ఒక ఇన్సాస్‌ రైఫిల్, ఒక సింగిల్ షాట్ గన్ ఉన్నాయి. సుక్రూ సహా నలుగురు ఇతర కేడర్లు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిని ప్రధాన స్రవంతిలోకి స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. మావోయిస్టు సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కంధమాల్ జిల్లాలో మిగిలిన మావోయిస్టుల సంఖ్య 8-9 మందికే పరిమితమైందని, మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ఆపరేషన్లు కొనసాగుతున్నాయని చెప్పారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ హరీషా బీసీ మాట్లాడుతూ కంధమాల్‌లో అతిపెద్ద మావోయిస్టు నేత సుక్రూ లొంగిపోవడంతో మిగిలిన వారు కూడా త్వరలో లొంగిపోతారు. ఇప్పుడు ఉన్నత నాయకత్వం లేకపోవడంతో వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి అని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మార్చి 31 నాటికి పూర్తి నిర్మూలన లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఒడిశాలో మావోయిస్టు కీలక నేత సుక్రూ లొంగుబాటు - Tholi Paluku