Let's talk: editor@tmv.in
ఒకే నగరం.. ఒకే సంబరం.

ఒకే నగరం.. ఒకే సంబరం.

FL - SIMHCLM
22 సెప్టెంబర్, 2025

ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవం, భక్తి, భిన్నత్వం కలగలిపిన విజయవాడ నగరంలో ఈ ఏడాది జరిగే దసరా ఉత్సవాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన

కనకదుర్గ అమ్మవారి అలంకార దర్శనాలు మరింత గొప్పగా నిలిపేలా "విజయవాడ ఉత్సవ్ పేరిట వినూత్న కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టారు. ప్రజలందరికీ ఒకే వేదికపై సాంస్కృతిక ఉత్సాహం, వినోదం, సంప్రదాయం, ఆధునికత” అన్న నినాదంతో ప్రారంభమైన ఈ మహోత్సవం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పది రోజులపాటు ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

నగరం నలుమూలల వేదికలు.

“ఒకే నగరం – ఒకే సంబరం” అనే నినాదంతో ప్రభుత్వ సహకారం, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఎంపీ కేశినేని శివనాథ్ రూపకల్పన చేసిన విజయవాడ ఉత్సవ్ ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చింది. నగరం నలుమూలలా వేదికలు సిద్ధమవుతున్నాయి. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కలాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఎంజీ రోడ్, విజయవాడ ప్రదర్శన స్థలం.. ఇలా ప్రతీచోటా వేర్వేరు అనుభూతులు కలిగించే ప్రదర్శనలు, గానవిందులు, నృత్యాలు, జానపద కళలు, ప్రజా క్రీడలు నగర వాసులతోపాటు, భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరం పంచనున్నాయి.

సంగీతం – నృత్యం – కళల వైభవం..

పున్నమి ఘాట్ వద్ద చంద్రకాంతి కచేరీ నుండి కర్నాటక గానసాంప్రదాయం వరకూ పది రోజుల పాటు సంగీత సంబరం. అభిజిత్ నాయర్, మాధురి, కామాక్షి, అభిలిప్సా, సందీప్ నారాయణ్, కారుణ్య వంటి ప్రముఖుల గానవిందులు భక్తులను, శ్రోతలను అలరించనున్నాయి.

తుమ్మలపల్లి కలాక్షేత్రం – ఘంటసాల సంగీత కళాశాల వద్ద..

ఇక్కడ సంప్రదాయానికి ఊతమిచ్చే ప్రదర్శనలు జరగనున్నాయి. వాటిలో సంప్రదాయ నృత్యాలు, భక్తి సంగీత కచేరీలు, జానపద నాటకాలు, బుర్రకథలు, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు నిర్వహిస్తారు.

విజయవాడ ప్రదర్శన వేదిక వద్ద..

సంగీత మాస్ట్రోలు మణిశర్మ, ఆర్‌.పీ. పాట్నాయక్, కార్తిక్, గీతా మాధురి గానామృతాన్ని అందించనున్నారు.

ఇక “విజయవాడ కిరీటం” (మహిళలు, పురుషులు), “విజయవాడ అవార్డులు”, “విజయవాడ మహిళా శక్తి సత్కారం” వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

వినోదం – ఆకర్షణలు..

ఈ ఉత్సవం కేవలం సంగీతం, నృత్యం వరకే పరిమితం కాకుండా కుటుంబాలందరికీ వినోదం అందించేలా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రూపుదిద్దారు. గొల్లపూడి సమీపంలోని సువిశాలమైన మైదానంలో చేపట్టిన ఎగ్జిబిషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.

భక్తులకు కన్నుల పండుగ..

అమ్మవారి ప్రత్యేక దర్శనం, నీటి క్రీడలు, డ్రోన్ ప్రదర్శనలు, ఆకాశ దీపావళి, హెలికాప్టర్ విహారం, మహా ఊరేగింపు, పిల్లలకు వినోద పార్కులు, ఆటవిడుపు కేంద్రాలు, ఆహార ప్రదర్శనలు, పందిళ్లు, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక అనుభవం కలిగేలా అన్ని రంగాలూ కలగలిపి ఈ మహోత్సవం రూపుదిద్దుకుంది.

ప్రత్యేక సత్కారాలు – ప్రజల గౌరవం.

యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు మహిళలు పురుషులకు వేరువేరుగా విజయవాడ కిరీటం, విజయవాడ కీర్తి అవార్డులు, విజయవాడ మహిళా శక్తి సత్కారం విజయవాడ గానం, ఒంటి కార్యక్రమాలు కార్యక్రమాలు జరిగే ఈ వేదిక ప్రజల హృదయాలను గెలుచుకోనుంది.

విజయవాడకు గర్వకారణం.

ఈ దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవం కేవలం రాష్ట్రానికే కాకుండా దేశమంతటికీ ఒక గర్వకారణం కానుంది. సంగీతం, నృత్యం, జానపదం, భక్తి, వినోదం అన్నీ కలిసిన ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద సాంస్కృతిక పండుగగా నిలిచే అవకాశం ఉంది.

ఎంపీ కేశినేని శివనాథ్ కు సీఎం చంద్రబాబు కితాబు.

విజయవాడ ఉత్సవ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను అందజేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కమిటీ సభ్యుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

ఒకే నగరం.. ఒకే సంబరం. - Tholi Paluku