
ఐసీసీ నుంచి అమెరికా అవుట్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అమెరికా క్రికెట్ యూఎస్ఏసీ టీమ్ ని సస్పెండ్ చేసింది. గత సంవత్సరంగా యూఎస్ఏ టీమ్ పై ఇన్ సైడ్ సర్వే లు, కొందరి ఎక్స్పర్ట్ తో సుధీర్గ చర్చలు జరిపిన అనంతరం ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. యూఎస్ఏ, ఐసీసీ సభ్యత నిబంధనలను పదేపదే ఉల్లంఘించడం, ఐసీసీ రూల్స్ లోని బాధ్యతలను పాటించకపోవడమే ఈ సస్పెన్షన్‌కు కారణం. అయినప్పటికీ, అమెరికా జాతీయ జట్లు ఐసీసీ ఈవెంట్లలో మరీ ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ లలో కూడా పాల్గొనేందుకు అర్హత పొందింది.
2024 ఐసీసీ వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశంలో యూఎస్ఏ, ఐసీసీ స్టాండర్డ్ ఆఫ్ డీసెన్సీని పాటించనందుకు నోటీసులో ఉంచబడింది. ఈ తప్పును సరి చేసుకోవడానికి యూఎస్ఏ టీమ్ కు 12 నెలల సమయం ఇచ్చింది. ఈ ఏడాది జులైలో ఐసీసీ సభ్యత్వం ‘ఫ్రీ అండ్ ఫైర్ ఎలెక్షన్స్‌ను నిర్వహించాలని, విస్తృతమైన పాలనను చేపట్టాలని నిర్ణయించింది.
పాలనా నిర్మాణం అమలులో వైఫల్యం, యునైటెడ్ స్టేట్స్ ‘ఒలింపిక్ అండ్ పారాలింపిక్ కమిటీ’ (యూఎస్ఓపీసీ)తో జాతీయ పాలనా సంస్థ హోదా సాధించడంలో ప్రోగ్రెస్ లేకపోవడం, అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు కీర్తిని దెబ్బతీసే చర్యలు, వంటి కారణాలను ఐసీసీ ఈ సస్పెన్షన్‌ను పేరుకొనింది.
ఈ నిర్ణయాన్ని క్రికెట్ ఆట దీర్ఘకాళిక ప్రయోజనాలను కాపాడేందుకు దురదృష్టకరమైనప్పటికీ, ముఖ్యమైన చర్యగా ఐసీసీ బోర్డు తెలియజేసింది. సస్పెన్షన్ తర్వాత, అమెరికా జాతీయ జట్ల నిర్వహణ, పరిపాలనను తాత్కాలికంగా ఐసిసి, దాని సెలెక్షన్ కమిట్టి పర్యవేక్షిస్తారు. ఇది ఆటగాళ్లకు నిరంతర మద్దతు అందించడానికి, ఒలింపిక్ సభ్యత్వం వైపు కొనసాగించడానికి ఉద్దేశించబడింది.
ఐ సీసీ ఛైర్మన్ జై షా నేతృత్వంలోని నార్మలైజేషన్ కమిటీ, యూఎస్ఏ సస్పెన్షన్‌ను ఎత్తి వేయడానికి, సభ్యత్వ హక్కులను పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలను తెలియజేస్తుంది. ఇందులో యూఎస్ఏ రూలింగ్ నిర్మాణం, కార్యకలాపాలు, క్రికెట్ ఏకో సిస్టమ్‌లో స్పష్టమైన మార్పులు ఉంటాయి. ఈ కమిటీ యూఎస్ఏ పురోగతిని పర్యవేక్షిస్తూ, సలహా సహాయాన్ని అందిస్తుంది.
