Let's talk: editor@tmv.in
ఐవోబీలో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

ఐవోబీలో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

Shaik Mohammad Shaffee
15 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), దేశవ్యాప్తంగా వివిధ విభాగాలలో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 3 దరఖాస్తుకు చివరి తేదీ. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మేనేజర్-ఐఎస్ ఆడిట్, సీనియర్ మేనేజర్-ఐఎస్ ఆడిట్, మేనేజర్-సివిల్, మేనేజర్-ఆర్కిటెక్ట్, మేనేజర్- ఎలక్ట్రికల్, మేనేజర్- ఐటీ, సీనియర్ మేనేజర్- ఐటీ వంటి వివిధ పోస్టులను భర్తీ చేస్తారు.

ప్రతి పోస్టుకు అవసరమైన విద్యార్హతలు, అనుభవం వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు ఐటీ పోస్టులకు బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ, సివిల్ మేనేజర్కు సివిల్ ఇంజినీరింగ్లో బీఈ/బీటెక్ డిగ్రీతో పాటు నిర్దిష్ట సంవత్సరాల అనుభవం ఉండాలి (అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి, తమ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి). పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. సాధారణంగా 25 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.175, ఇతరులకు రూ.1,000 దరఖాస్తు ఫీజుగా ఉంది.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఆన్లైన్ పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.iob.in సందర్శించి, 'కెరీర్స్/రిక్రూట్మెంట్' సెక్షన్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.

ఐవోబీలో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - Tholi Paluku