Let's talk: editor@tmv.in
ఐబీపీఎస్‌ పీఓ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ఐబీపీఎస్‌ పీఓ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

Shaik Mohammad Shaffee
27 సెప్టెంబర్, 2025

//www.ibps.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఆగస్టు 23, 24 తేదీల్లో పీఓ ప్రిలిమ్స్ 2025 పరీక్షలు ఐబీపీఎస్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

మెయిన్స్ పరీక్ష

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ పరీక్ష అక్టోబర్/నవంబర్ నెలలో జరిగే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డుల వివరాలను ఐబీపీఎస్ త్వరలో అధికారికంగా వెల్లడించనుంది.

ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌తో పాటు డిస్క్రిప్టివ్ పేపర్ (ఇంగ్లీష్ లాంగ్వేజ్) కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ మార్కులు తుది ఎంపికకు పరిగణించబడవు. మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ఐబీపీఎస్ పీఓ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.

బ్యాంకు పీఓ కెరీర్ ఎలా ఉంటుంది?

ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్ట్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక ఎంట్రీ-లెవల్ మేనేజీరియల్ స్థాయి ఉద్యోగం. ఈ ఉద్యోగంలో చేరిన వారి కెరీర్ చాలా వేగంగా ఉంటుంది. పనితీరు ఆధారంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి.

ప్రొబేషనరీ ఆఫీసర్‌గా (పీఓ) కెరీర్‌ను ప్రారంభించిన వారు అసిస్టెంట్ మేనేజర్‌గా, డిప్యూటీ మేనేజర్‌గా, మేనేజర్‌గా, సీనియర్ మేనేజర్‌గా, చీఫ్ మేనేజర్‌గా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా, డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా, జనరల్ మేనేజర్‌గా పదోన్నతులు పొందే అవకాశం ఉంది. అత్యంత ప్రతిభావంతులైన పీఓలు బ్యాంక్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా చైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు.

పీఓ విధులు: క్యాష్ కౌంటర్ నిర్వహణ, ఖాతాలు తెరవడం, కస్టమర్ సమస్యలను పరిష్కరించడం వంటి సాధారణ బ్యాంకింగ్ విధులతో పాటు, రుణ దరఖాస్తులను పరిశీలించడం, వాటిని ఆమోదించడం, బ్రాంచ్‌లోని రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం, అంతర్గత నిర్ణయాలు తీసుకోవడం, ఎఫ్‌డీలు, బీమా, మ్యూచువల్ ఫండ్స్ విక్రయించడం ద్వారా బ్యాంకు వ్యాపారాన్ని పెంచడానికి కృషి చేయడం.

పీఓ జీతం, అలవెన్సులు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఓ జీతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సాధారణంగా పీఓ జీతం రూ.65,000 నుండి నుండి రూ.70,000 వరకు ఉంటుంది (పోస్టింగ్ నగరాలను బట్టి ఇది మారవచ్చు). జీతంతో పాటు పీఓలకు వైద్య సహాయం, ట్రావెల్ అలవెన్సులు, న్యూస్ పేపర్ అలవెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఐబీపీఎస్‌ పీఓ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల - Tholi Paluku