
ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మోహపాత్రకు సర్ గిల్బర్ట్ వాకర్ అవార్డు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రను భారత వాతావరణ శాఖ (ఐఎంఎస్) 2025 సర్ గిల్బర్ట్ వాకర్ అవార్డుతో సన్మానించింది. వాతావరణ శాస్త్రంలో చేసిన సేవలు, విశేష కృషికి, ఫోర్కాస్టింగ్ వ్యవస్థల ఆధునీకరణ, వాతావరణ హెచ్చరికలలో చేసిన విశేష కృషికిగాను ఆయనకు ఈ గౌరవం లభించింది.‘సైక్లోన్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన మోహపాత్ర 2007 నుంచి భారత సైక్లోన్ హెచ్చరిక వ్యవస్థను ఆధునీకరించి, ఫోర్కాస్ట్ ఖచ్చితత్వం, ప్రిపేర్‌డ్‌నెస్ పెంపునకు కీలక పాత్ర పోషించారు. ఐఎంమోడర్నైజేషన్ ప్రోగ్రామ్, సీవియర్ వాతావరణ ఫోర్కాస్టింగ్ ప్రోగ్రామ్, సౌత్ ఏషియా ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సిస్టమ్, మిషన్ మౌసం వంటి కీలక ప్రాజెక్ట్‌లను ఆయన ముందుగా నడిపారు.
1965 ఆగస్టు 12న ఒడిశా భద్రక్ జిల్లాలో జన్మించిన మోహపాత్ర డీఆర్డీఓలో పని చేశారు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశారు. 1992లో ఐఎండీలో చేరి 2019లో డైరెక్టర్ జనరల్‌గా ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతానికి ఆయన వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్– ఐరాస ఎస్సీఏపీ ట్రోపికల్ సైక్లోన్ ప్యానెల్ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. అయన ప్రధాన కృషిలో సైక్లోన్ ఫోర్కాస్టింగ్, స్వదేశీ డిసిజన్-సపోర్ట్ టూల్స్, ప్రభావ ఆధారిత హెచ్చరికలు, వాతావరణ విభాగాలవారీగా ఆయన చేసిన సేవలు వాతావరణ శాఖలో చిరస్థాయిగా నిలిచాయి.
సర్ గిల్బర్ట్ వాకర్:
ఈయన బ్రిటిష్ వాతావరణ శాస్త్రజ్ఞుడు, 1868–1958 మధ్య జీవించారు. ఆయన ప్రధానంగా ఆసియా, ముఖ్యంగా భారత ఉపఖండంలోని వాతావరణంపై పరిశోధన చేశారు. ఆయన అత్యంత కృషి చేసిన ‘వాకర్ సర్క్యూలేషన్’ లో ఉంది. ఇది వాతావరణం, మాన్సూన్ సైక్లోన్లను అర్థం చేసుకోవడంలో కీలకంగా పని చేస్తోంది. వాకర్ లాంగ్ టర్మ్ వాతావరణ డేటాను విశ్లేషించి, ‘ఎల్ నినో’ వంటి పరిణామాలను అంచనా వేయడానికి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు.
అత్యున్నత అవార్డు
ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చే అత్యున్నత అవార్డు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కోసం, వాతావరణ విభాగంలో చేసిన విప్లవాత్మక కృషిని గుర్తించి ఇస్తారు. డీజీ మృత్యుంజయ్ మోహపాత్రకు ఇది ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు. ఇది ఆయన సైక్లోన్ ఫోర్కాస్టింగ్, హెచ్చరిక వ్యవస్థల ఆధునీకరణలో చేసిన విశేష కృషికి లభించిన జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు.
