
ఏ పి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవ్యవస్థలో మరో అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి చేరారు. జస్టిస్ సుభేందు సామంత నియామకం హైకోర్టు న్యాయ పరిపాలనను మరింత బలోపేతం చేస్తుంది. జస్టిస్ సుభేందు సామంత కలకత్తా హైకోర్టు నుండి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ సుభేందు చే న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా జస్టిస్ ఏకటి మానవేంద్రనాథ్ రాయ్ కూడా పోయిన సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. వీరితో కలిపి ఆంద్రప్రదేశ్ హై కోర్టులో ప్రస్తుతం 37 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరలో శాశ్వత న్యాయమూర్తులు 28 మంది ఉండగా, అదనపు న్యాయమూర్తులు 9 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉంది. ప్రధాన న్యాయమూర్తిగా ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఉన్నారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ,అదనపు అడ్వకేట్ జనరల్, ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు ఉద్యోగులు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
