Let's talk: editor@tmv.in
ఏషియా ర్యాంకింగ్‌లో యూపీ విశ్వవిద్యాలయాల ఘనత

ఏషియా ర్యాంకింగ్‌లో యూపీ విశ్వవిద్యాలయాల ఘనత

Yellarthi Chennabasava
6 నవంబర్, 2025

ఉత్తరప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో ప్రతిష్టాత్మక స్థానాలను సాధించాయి. ఈ ర్యాంకింగ్స్ ద్వారా రాష్ట్రంలోని విద్యా సంస్థల ప్రావీణ్యం, పరిశోధన సామర్థ్యం, ఫ్యాకల్టీ–విద్యార్థి నిష్పత్తి, అంతర్జాతీయ గుర్తింపు వంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. విశ్వవిద్యాలయాలు అకడమిక్ నాణ్యత, సాంకేతిక విద్య, పరిశోధనలో ఉన్నతమైన పనితీరుతో అభివృద్ధి చెందుతున్నట్లు ఈ ర్యాంకింగ్ సూచిస్తుంది. ఇది యూపీ విద్యా రంగంలో సాధించిన ప్రగతిని ప్రపంచానికి తెలియజేస్తూ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ప్రతిష్టను పెంపొందిస్తోంది. అంతేకాక, ఈ ఘనత విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు చేసిన కృషికి గుర్తింపు కాబడుతుంది. ఈ ర్యాంకింగ్‌లు రాష్ట్రంలోని విద్యా రంగానికి ప్రేరణగా నిలిచేలా, నూతన విద్యా ప్రమాణాలు, పరిశోధన అవకాశాలను మరింత ప్రోత్సహిస్తాయి.

రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఈ విజయానికి ఉపాధ్యాయులు, పరిశోధకులు, నిర్వాహకులు, విద్యార్థుల కృషి కీలకమని అభినందించారు. ఈ గుర్తింపు రాష్ట్రానికి,దేశానికి గర్వకారణం. యూపీ విశ్వవిద్యాలయాలు విద్య, పరిశోధన, సామాజిక రంగంలో కొత్త మైలురాళ్లను సాధిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధాన ర్యాంకులు:

• లక్నో విశ్వవిద్యాలయం: ఏషియాలో 781–790, సౌత్ ఏషియాలో 244

• చౌదరి చరణ్ సింగ్, మీరట్; బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్, లక్నో: ఏషియాలో 801–850, సౌత్ ఏషియాలో 254

• బుందెల్‌ఖండ్, ఝాన్సీ; మహాత్మా జ్యోతిబా ఫూలే, బరేల్లి; చత్రపతి షాహు జీ మహారాజ్, కాన్పూర్: ఏషియాలో 901–950, సౌత్ ఏషియాలో 297

• దీన్ దయాళ్ ఉపాధ్యాయ, గోరఖ్పూర్: ఏషియాలో 1001–1100, సౌత్ ఏషియాలో 330

• వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్, జౌన్‌పూర్: ఏషియాలో 1201–1300, సౌత్ ఏషియాలో 397

ఏషియన్ ర్యాంకింగ్స్ అనేవి విశ్వవిద్యాలయాల నాణ్యత, పరిశోధన సామర్థ్యం, అంతర్జాతీయ గుర్తింపు, ఫ్యాకల్టీ–విద్యార్థి నిష్పత్తి, పరిశోధన నెట్‌వర్క్, సిటేషన్స్, ఉద్యోగ అవకాశాల ప్రతిష్ట వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని శాస్త్రీయ ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది .

యూపీ ఉన్నత విద్యా మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉన్నత విద్యా ప్రమాణాలు, పరిశోధన అభివృద్ధి చర్యలకు అభినందనలు తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు, డిజిటల్ విద్య, పరిశ్రమ-అకడమి భాగస్వామ్యం, పరిశోధన ప్రోత్సాహక పథకాలు యూపీ విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయంగా బలపరిచాయి.

అంతేకాక, నిరంతర సంస్కరణలు, ఆవిష్కరణ ఆధారిత విద్యా విధానాలు, అంతర్జాతీయీకరణ ప్రయత్నాలు రాష్ట్ర విశ్వవిద్యాలయాలను గ్లోబల్ గుర్తింపుకు తేలికగా నిలిపాయని, యూపీ విద్య, పరిశోధన, ఆవిష్కరణలో పెరుగుతున్న శక్తిని ప్రదర్శిస్తున్నాయని ఉపాధ్యాయ్ తెలిపారు.

ఏషియా ర్యాంకింగ్‌లో యూపీ విశ్వవిద్యాలయాల ఘనత - Tholi Paluku