Let's talk: editor@tmv.in
ఏపీ ప్రభుత్వంపై ఆరోగ్య శ్రీ బిల్లుల భారం

ఏపీ ప్రభుత్వంపై ఆరోగ్య శ్రీ బిల్లుల భారం

FL - SUNL
18 సెప్టెంబర్, 2025

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్న తరుణంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి నెలకొన్నది. ప్రస్తుతానికి ఏదోలా అలా నడుస్తున్నా

ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఇప్పటికీ ప్రభుత్వం మీద కారాలుమిరియాలు నూరుతున్నాయి.. తమకు ఇవ్వాల్సిన రూ. 2500 కోట్ల బకాయిలు ఇవ్వకపోతే ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని అంటున్నారు. మొన్నటికీ ఆస్పత్రులు ఈ అల్టిమేటం ఇచ్చినా ఏదోలా ప్రభుత్వం వారిని ఒప్పించి మళ్ళీ సేవలు కొనసాగేలా నచ్చజెప్పింది.. కానీ ఇంకా ఎన్నాళ్ళో వారిని ఊరుకోనివ్వడం కష్టం. ఇప్పటికే తమమీద బోలెడు ఆర్థిక భారం పడుతోంది అని.. ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉందని

ప్రయివేటు ఆస్పత్రులు అంటున్నాయి.. ప్రభుత్వం బిల్లులు ఆపేస్తే ఎల్లా అని ఆవేదన చెందుతూనే బిల్లులు ఇవ్వకుంటే సర్వీసులు నిలిపేస్తామని హెచ్చరించాయి..

అదే జరిగితే పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందక ... చేతి డబ్బులు పెట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.. ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది. అందుకే ఇప్పుడు కొంతైనా బిల్లులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

దాదాపు ఏడాది గా నెట్ వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ కింద బిల్లులు విడుదల చేయలేదు. దీంతో ఇప్పటికే పలుమార్లు.. చర్చలు జరిపినా.. పలు సందర్భాల్లో వాయిదా వేసినా.. ఇక ఇప్పుడు మాత్రం ఆస్పత్రుల వాళ్ళు తగ్గేదే లేదు అంటున్నారు. బిల్లులు తక్షణమే ఇవ్వాల్సిందేనని అంటున్నారు. తమకు ఖర్చులు పెరిగిపోయాయని.. సర్కారు నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోతె ఆస్పత్రుల మనుగడ ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఆంత డబ్బు ఎలా తేవాలి అనే టెన్షన్ ప్రభుత్వంలో ఉంది..

ఏపీ ప్రభుత్వంపై ఆరోగ్య శ్రీ బిల్లుల భారం - Tholi Paluku