
ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
Gaddamidi Naveen
28 ఫిబ్రవరి, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన భట్టి విక్రమార్క, మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల నేతల మధ్య కొద్దిసేపు ఆత్మీయ సంభాషణ సాగింది. అంతకుముందు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
