Let's talk: editor@tmv.in
ఏపీలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఏపీలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

FL - SUNL
10 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లోని 31 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేపట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ముఖ్య అధికారుల నియామకాలు, అదనపు బాధ్యతలలో కీలక వ్యక్తుల వివరాలు ఉన్నాయి.

కేవీఎన్ చక్రధర్ బాబును సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా నియమించారు. అలానే మనజీర్ జిలానీ సమూన్ వ్యవసాయశాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు.

అలాగే పి. రవిసుభాష్ ను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సెక్రటరీగా నియమించారు. వివిధ పబ్లిక్ కంపెనీలకు సంబంధించి కూడా కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. లోతేటి శివశంకర్ ను ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ ఎండీగా, ఎస్. ఢిల్లీ రావు ను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. అలాగే పి. రంజిత్ బాషాను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా, అదనంగా పాఠశాల మౌలిక సదుపాయాల కమిషనర్గా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా పి. అరుణ్ బాబు, జె.వి. మురళి అడిషనల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమ్ సెక్రటరీగా, టి.ఎస్. చేతన్ సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. బి. నవ్య ను ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా, సి.వి. ప్రవీణ్ ఆదిత్య ను ఏపీఏడీసీఎల్ ఎండీగా నియమించారు. మరికొందరు జూనియర్ ఐఏఎస్ అధికారులకు జేసీలుగా, డెప్యూటీ సెక్రటరీలుగా, ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.